Ram Gopal Varma : వైరల్ : బాలీవుడ్ లో సౌత్ సినిమా డామినేషన్ పై ఆర్జీవీ సంచలన పోస్ట్.!

 Ram Gopal Varma :  ఇప్పుడు మన తెలుగు సినిమా గాని సౌత్ ఇండియా లో ఉన్న ఇతర భాషల పలు సినిమాలు గాని టోటల్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పెర్ఫామెన్స్ చేస్తున్నాయో తెలిసిందే.
బాహుబలి సిరీస్ తో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి బద్దలుకొట్టిన గేట్లు ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 దెబ్బకి వేరే రేంజ్ లోకి వెళ్లిపోయాయి.
అలాగే లేటెస్ట్ గా భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కూడా హిందీలో రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. మరి ఇలా బాలీవుడ్ లో సౌత్ ఇండియన్ సినిమాల డామినేషన్ పై సంచలన దర్శకుడు లేటెస్ట్ గా ఒక పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది.
వర్మకి బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో కూడా లింక్ ఉండడంతో ఈ పోస్ట్ మరింత భగ్గుమంటుంది.
ఈ పోస్ట్ లో హిందీలో మొదటి రోజు అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాలు లిస్ట్ పెట్టి హే హిందీ సినిమా(బాలీవుడ్) మీ ఇండస్ట్రీలో టాప్ స్థానాల్లో కేజీయఫ్ 2, బాహుబలి 2 లాంటి సౌత్ ఇండియా సినిమాలు కనిపిస్తున్నాయి కానీ మీ హిందీ(బాలీవుడ్) సినిమాలు ఎందుకు లేవు? అని ప్రశ్నించాడు.
దీని బట్టి హిందీలో సౌత్ ఇండియా సినిమాల డామినేషన్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చని తన ట్వీట్ లో పరమార్ధం అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం వర్మ పుండు మీద కారం జల్లినట్టు చేసాడని చెప్పాలి.
https://twitter.com/RGVzoomin/status/1514469398626521089