డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో సుహాస్ నటించిన సరికొత్త చిత్రం జనక అయితే గనక. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల చేత పర్వాలేదనిపించుకుంది. దిల్ రాజు బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్సిత ఈ సినిమాని నిర్మించారు. సుహాస్ నటించిన మరొక డిఫరెంట్ సినిమా అయిన జనక అయితే గనక హీరోయిన్ గా సంకీర్తన విపిన్ నటించినది.
అక్టోబర్ 12న విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ బోల్డ్ గా ఉన్నా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా సినిమాని తెరకెక్కించారని రివ్యూస్ వచ్చాయి. ఎప్పటిలాగే సుహాస్ తన యాక్టింగ్ తో అదరగొట్టేసాడు. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈ సినిమా నవంబర్ 8 నుంచి ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అక్కడ కూడా మంచి వ్యూస్ సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పుడు టీవీలో ప్రసారమయ్యేందుకు రెడీగా ఉంది.
డిసెంబర్ 22 సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ మా టీవీ ఛానల్ లో ఈ సినిమా ప్రసారమవుతుందని స్టార్ మా వెల్లడించింది. లైఫ్ లో సెటిల్ అవ్వకముందే పెళ్లి చేసుకున్న ఒక మిడిల్ క్లాస్ యువకుడు ప్రసాద్(సుహాస్ )పిల్లలు వద్దనుకుంటాడు. భార్య భర్తలు ఇద్దరూ ఫ్యామిలీ ప్లానింగ్ ప్లాటిస్తారు. అయితే అనుకోకుండా ఒక రోజు అతని భార్య గర్భం దాలుస్తుంది దానికి కారణం కండోమ్ చినిగిపోవడమే అని తెలుసుకున్న యువకుడు ఆ కంపెనీపై కేసు వేస్తాడు.
కోటి రూపాయలు పరిహారం కోరుతాడు, అయితే ఈ కేసులో ప్రసాద్ గెలిచాడా? కోటి రూపాయలు పరిహారం అందిందా? పిల్లలకు తండ్రి అయ్యాడా అనేది చిత్ర కధ. ఇక ఈ సినిమాలో గోపరాజు రమణ, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, మురళి శర్మ తదితరులు ప్రధానపాత్రలు పోషించారు. బేబీ సినిమాతో ఫేమస్ అయిన విజయ్ బుల్గాని ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు. ఇక ఈ సినిమా టీవీలో ఏమాత్రం టిఆర్పి రేట్ సంపాదిస్తుందో చూడాలి.