అందులో సిగ్గు పడాల్సిన పనిలేదు.. ఆ పాత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రకుల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న వారిలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటివరకు ఎన్నో గ్లామర్ పాత్రల్లో చేసినప్పటికీ ప్రస్తుతం విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని అలాంటి సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ ఛత్రివాలా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో ఈమె కండోమ్ టెస్టర్ పాత్రలో సందడి చేయనున్నారు.

ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కండోమ్ టెస్టర్ పాత్రలో నటించడం పట్ల కొందరు ఈమె పాత్ర పై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయంపై స్పందించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ ఇందులో సిగ్గు పడాల్సిన విషయం కాదని, సొసైటీలో కండోమ్ పై ఉన్న కన్ఫ్యూషన్ ను తొలగించడం కోసం ఈ పాత్రలో నటించానని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.

ఈ విధంగా ఈమె తన పాత్ర గురించి తెలియగానే ముందుగా తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియచేసి వాళ్ళు కూడా ఈ పాత్రలో నటించడానికి మద్దతు తెలియజేసిన తరువాతనే తాను ఈ సినిమాలో ఈ పాత్రలో నటించానని తెలిపారు. ఈ పాత్రను ఎంతో ఛాలెంజింగా తీసుకుని నటించానని రకుల్ వెల్లడించారు. ఇక ప్రస్తుతం తెలుగులో ఇలాంటి సినిమాల్లో నటించకపోయినా హిందీలో ఈమె నటించిన నాలుగు ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.