పవన్ ‘వీరమల్లు’ ప్లానింగ్ ఇప్పటిది కాదట

harihara veeramallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి చారిత్రిక నేపథ్యంలో చేస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. క్రిష్ దర్శకుడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఉండనుంది. సుమారు ఐదారు భాషల్లో రిలీజ్ కానుంది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సహా సినిమా అప్డేట్స్ అన్నీ ఈమధ్యనే బయటికి వస్తుండటంతో సినిమా కూడ ఈమధ్యనే మొదలైందని, హడావుడిగా చేసేశారని అనుకుంటున్నారు చాలామంది. చాలామంది హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుండటంతో పవన్ కూడ చేస్తున్నారని భావిస్తున్నారు.

అయితే వాటిలో ఏమాత్రం నిజం లేదు. అందరూ చేస్తున్నారు కదా మనమూ చేద్దాం అనే ఉద్దేశ్యంలో పవన్ సినిమా చెయ్యట్లేదు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారు. లాక్ డౌన్ ముందు సినిమాను అనుకున్నప్పుడే పాన్ ఇండియా లెవల్లో తీయాలని డిసైడ్ అయ్యారట. యూనివర్సల్ సబ్జెక్ట్ కావడం వలన అన్ని భాషలు ప్రేక్షకులకు యాప్ట్ అవుతుందని భావించి ఆ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాత ఏ.ఎం. రత్నం సైతం పవన్ అభిప్రాయంతో ఏకీభవించి పాన్ ఇండియా లెవల్ కోసం భారీ బడ్జెట్ కేటాయించడానికి అంగీకరించారు. లాక్ డౌన్ కు ఆరు నెలల ముందే ఈ చర్చలన్నీ జరిగాయని అప్పటి నుండి కథ, పాత్రల మీద రీసెర్చ్ జరుగుతూ వచ్చిందని చిత్ర బృందం చెబుతున్నారు.