Bheemla Nayak : గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ మరియు టాలీవుడ్ హ్యాండ్సమ్ హాంక్ రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన లేటెస్ట్ పవర్ ఫుల్ మాస్ చిత్రం “భీమ్లా నాయక్”. ఒక్కసారిగా భారీ హైప్ ని తెచ్చుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ తో అన్ని వర్గాల్లో సాలిడ్ హైప్ ని ఈ సినిమా నెలకొల్పుకుంది.
అయితే ఈ సినిమా బుకింగ్స్ పరంగా తెలంగాణా లో కొన్ని అడ్డంకులు ఉన్నాయి కానీ యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం భీమ్లా నాయక్ దుమ్ము లేపుతుంది. ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ కాని ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా యూఎస్ ఏ లో 3 లక్షల డాలర్లు మార్క్ ని క్రాస్ చేసేసింది అట. అంటే సినిమా రిలీస్ కాకముందే భీమ్లా నాయక్ 2.23 కోట్లు వసూలు చేసేసిందట.
అంటే ఈ లెక్కన భీమ్లా నాయక్ క్రేజ్ అక్కడ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా ఈ సినిమాని సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా మాటలు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించారు. అలాగే నిత్య, సంయుక్త మీనన్ లు హీరోయిన్లు గా నటించగా సితార బ్యానర్ పై నాగవంశీ నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 25న విడుదల కానుంది.
