Home News తమిళ్ లో కూడా పాగా వేయబోతున్న 'బుట్టబొమ్మ' ?

తమిళ్ లో కూడా పాగా వేయబోతున్న ‘బుట్టబొమ్మ’ ?

తమిళ్ లో మిస్కిన్ రాజ్ డైరెక్షన్ లో ‘ముగమూడి’ ద్వారా ముంబై ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో చేసిన కొన్ని సినిమాలు కూడా ఫెయిల్ అయ్యాయి. ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా నుండి అమ్మడు జాతకం మారిపోయింది. ఆమె చేసిన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. దాంతో మొదట్లో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ని సొంతం చేసుకున్న ఈ భామ కోసం ఇప్పుడు గోల్డెన్ లెగ్ అంటూ స్టార్ హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎదురుచూస్తున్నారు. పూజా ఎంత పారితోషకం అడిగినా ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నారట.

Pooja Hegde Is Going To Act In Murugadoss Tamil Movie
Pooja Hegde is going to act in murugadoss tamil movie

తాజాగా ఈ ముంబై భామ మ‌రో క్రేజీ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఈ సంక్రాంతికి `మాస్ట‌ర్` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విజ‌య్ ఈ మూవీ త‌రువాత నెల్స‌న్ దిలీప్‌కుమార్‌తో ఓ మూవీ చేయ‌బోతున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ వ‌చ్చేనెల ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ త‌రువాత విజ‌య్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ ఏ.ఆర్‌. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ మూవీ చేయ‌బోతున్నారు.ఈ చిత్రం కోసం విజ‌య్‌కి జోడీగా చిత్ర బృందం పూజా హెగ్డేని ఎంపిక చేసిన‌ట్టు, ఆమె కూడా ఓకే చేసినట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానున్న‌ట్టు తెలిసింది.

ప్రస్తుతం పూజ తెలుగులో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ షూటింగ్ చివరి దశలో ఉండగా , ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’లో నటిస్తుంది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న మూవీలో కూడా ఈ భామనే కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్ లో మరో రెండు కేజ్రీ ప్రాజెక్ట్స్ ని కూడా ఆమె లైన్ లో పెట్టారు. స‌ల్మాన్‌ఖాన్‌తో `క‌బీ ఈద్ క‌బీ దివాలి`, ర‌ణ్‌వీర్ సింగ్‌తో `స‌ర్క‌స్‌` చిత్రాల్లో న‌టిస్తోంది. 2021 మొత్తం తెలుగు, తమిళ ,హిందీ భాషలలో ఈ ముద్దుగుమ్మనే దున్నేయనుంది.

- Advertisement -

Related Posts

దేవినేని అవినాష్‌కు పెద్ద బాధ్యతే అప్పజెప్పిన సీఎం జగన్… నిరూపించుకుంటే ఇక దశ మారినట్టే ?

ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో జరగబోతున్న తొలి ఎన్నికలు కావడంతో ఏపీలోని ప్రధాన రాజకీయ...

సైబర్ నేరగాళ్ల బారిన పడ్డ “భీష్మ” డైరెక్టర్ !

టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతూ పోతోందో అంతే వేగంగా సైబర్ నేరగాళ్ల అక్రమాలూ పెరిగిపోతున్నాయి. సామాన్యులనే కాకుండా, ఈ సైబర్ నేరగాళ్లు ప్రముఖుల్ని వదలడం లేదు. తాజాగా నితిన్‌, రష్మిక మందానా జంటగా...

‘దృశ్యం 2’ షూటింగ్ మొదలెట్టిన వెంకటేశ్ !

గతంలో వచ్చిన 'దృశ్యం' సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఓ హత్య విషయంలో హీరో ఇంటిల్లిపాదీ ఒకే మాటపై నిలబడడం.. పోలీసులు ఎంతగా విచారణ చేసినా నిజం కక్కకపోవడం.. అదంతా ఓ కొత్త...

Latest News