పూజా హెగ్దేకి మళ్ళీ ఐటమ్ సాంగేనా.?

ప్చ్.. ఐటమ్ సాంగ్స్‌తోనే సరిపెట్టుకోవాలేమో.! ఔను, పూజా హెగ్దే పరిస్థితి ఇలాగే వుంది తెలుగులో ఇప్పుడు. ఆ మధ్య ఒకట్రెండు సినిమాలకు పూజా హెగ్దే కమిట్ అయినట్లు గుసగుసలు వినిపించాయిగానీ, ఆ ప్రాజెక్టులేవీ ముందుకు కదిలినట్లు కనిపించడంలేదు.

ఇదిలా వుంటే, తాజాగా పూజా హెగ్దే ముందరకు ఓ ఐటమ్ సాంగ్ ప్రపోజల్ వెళ్ళిందట. వెంటనే, పూజా హెగ్దే ‘యస్’ చెప్పేసిందని అంటున్నారు. ఐటమ్ సాంగ్ అంటే, ఐటమ్ సాంగ్ కాదుగానీ.. సెలబ్రేషన్ సాంగ్ లాంటిది.. అనే ప్రచారం జరుగుతోంది.

మొన్నామధ్య ‘ఎఫ్-3’ సినిమాలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు అలాంటిదేనట ఇది కూడా. పూజా హెగ్దే స్క్రీన్ ప్రెజెన్స్ ఆ పాటని వేరే లెవల్‌కి తీసుకెళ్ళింది. సినిమా కాస్తో కూస్తో నిలబడిందంటే ఆ సాంగ్ వల్లేనని నిస్సందేహంగా చెప్పొచ్చు.

ఇక, తాజా స్పెషల్ సాంగ్ విషయానికొస్తే, ఓ యంగ్ హీరో సినిమా కోసం డిజైన్ చేశారట. త్వరలో పూజా హెగ్దే సెట్స్‌లో జాయిన్ అవుతుందని అంటున్నారు. రెమ్యునరేషన్ కూడా చాలా గట్టిగానే ఆఫర్ చేశారట పూజా హెగ్దేకి.

ఇదొక్కటే, ఇంకో సాంగ్ చేయబోనంటూ.. తన వద్దకు వస్తున్న దర్శక నిర్మాతలకు తెగేసి చెబుతోందట పూజా హెగ్దే స్పెషల్ సాంగ్స్ విషయమై. అయినా, పూజా హెగ్దే కెరీర్ ఎందుకింత డల్లుగా మారిపోయింది.? అంటే, బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తాలూకు ఎఫెక్ట్ మరి.

అన్నట్టు, మెగా కాంపౌండ్‌కి సంబంధించిన ఓ హీరో నటిస్తోన్న సినిమాలోనూ పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వుందట.