Pawan Kalyan Sensational Comments : గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా రీసెంట్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “భీమ్లా నాయక్” సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి గాను అనధికారికంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అందరికీ తెలిసిందే. మరి త్రివిక్రమ్ కి మరియు పవన్ కి ఉన్న సాన్నిహిత్యం కోసం కూడా అందరికీ తెలుసు.
అందులో భాగంగానే తమ హ్యాట్రిక్ సినిమా “అజ్ఞ్యాతవాసి” భారీ ప్లాప్ కావడంతో ఈ సారి ఆ బాకీని తీర్చాలని త్రివిక్రమ్ బీమ్లా నాయక్ సినిమాకి అంతా వెనుకుండి నడిపించాడు. మరి అలాంటి త్రివిక్రమ్ పై పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా కొన్ని ఊహించని కామెంట్స్ చెయ్యడం ఆసక్తిగా మారిపోయింది.
త్రివిక్రమ్ గాని వచ్చి అడిగితే ఫ్రీ గా ఒక సినిమా అయినా చేసేస్తాను కానీ నా దగ్గర ఉన్న పుస్తకం మాత్రం ఒక్కటి కూడా తనకి ఇవ్వనని చెప్పారు. అంటే తనకు పుస్తకాలు అంటే అంత ఇష్టం అని. అందుకే త్రివిక్రమ్ వచ్చిన ప్రస్తుం సారి అదే భయం వేస్తుంది అని..
ఎప్పుడు ఏ బుక్ నా దగ్గర అడుగుతాడో అని పవన్ నిన్న జరిగిన ఓ సభలో తెలియజేసారు. దీనితో ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ప్రస్తుతం అయితే త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఓ సినిమాకి సిద్ధం అవుతుండగా పవన్ “హరిహర వీరమల్లు” మరియు “భవదీయుడు భగత్ సింగ్” సినిమాలు చేస్తున్నాడు.
