BJP Vs Jansena : బీజేపీ ప్లస్ జనసేన కాదా.? బీజేపీ వర్సెస్ జనసేనా.?

BJP Vs Jansena : ఇదెక్కడి కొత్త పంచాయితీ.? బీజేపీ ప్లస్ జనసేన.. ఈ కూటమి కదా, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని బీజేపీ పదే పదే చెబుతున్నది. ‘మా మిత్రపక్షం బీజేపీ’ అని గట్టిగా జనసేన చెబుతున్నప్పుడు, ఈ రెండు పార్టీల మధ్యనా పంచాయితీ ఏంటి.? అంటే, దానికి చాలా పెద్ద కథ వుంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల గుంటూరు జిల్లా అమరావతిలో నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్రం చేస్తున్న అప్పులు, దేశం చేస్తున్న అప్పుల గురించి పెద్ద కథ చెప్పారు. నిజానికి, ఆయన ఉద్దేశం దేశాన్ని ప్రస్తావించడం కాదు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడటం.

అయితే, ఆ అప్పుల వ్యవహారం బీజేపీకి కూడా గట్టిగా తగిలేసింది వైసీపీతో పాటుగా. రాష్ట్ర అప్పులు, దేశ అప్పులు.. అన్నీ కలిసి సామాన్యుడి నెత్తి మీదనే భారం. ఆ నెత్తిన భారం విషయాన్ని చాలా చక్కగా చెప్పారు పవన్ కళ్యాణ్. దాంతో బీజేపీ ఒకింత గుస్సా అవుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే చట్ట సభల్లో మాట ఇవ్వడమంటే అది శాసనం కిందే లెక్క.. అని పవన్ చెప్పుకొచ్చారు. ఆ లెక్కన పార్లమెంటు సాక్షిగా ఏపీకి ప్రకటించిన ప్రత్యేక హోదా కూడా శాసనం కిందనే భావించాలి. ఈ రెండు విషయాలపై లోతైన చర్చ జరుగుతోంది జనంలో. అది బీజేపీకి నచ్చడంలేదు.

వీటికి తోడు రోడ్ మ్యాప్ వ్యవహారంపై ఇరు పార్టీల మధ్యా తెరవెనుకాల రచ్చ జరుగుతోంది. మేం ఇచ్చేశామంటుంది బీజేపీ.. బీజేపీ ఇవ్వాలంటుంది జనసేన. వెరసి, ఈ కొట్లాట చూస్తోంటే.. బీజేపీ వర్సెస్ జనసేనలా వుంది తప్ప, బీజేపీ ప్లస్ జనసేనలా కనిపించడం లేదు.!