గోదావరి జిల్లాల్లో లేటెస్ట్ టాక్ ఇదే!!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా.. విభజిత ఆంధ్రప్రదేశ్ లో అయినా.. ఎన్నికల వేళ గోదావరి జిల్లాలకు సంబంధించిన ప్రజల అభిప్రాయంగా తీవ్ర చర్చ జరుగుతుందనే సంగతి తెలిసిందే. అందుకు కారణం… ఈ 34 సీట్లున్న ఈ ప్రాంతంలోని ప్రజలు ఎప్పుడూ మిక్స్డ్ టాక్ తీర్పు ఇవ్వరు.. ఇస్తే వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. అంటే… ఒక వైపే చూస్తారన్న మాట.. ఒక్కసారి వద్దనుకుంటే రెండోవైపు చూడమన్నా చూడరు!

ఈ ఎన్నికలు అధికార వైసీపీకి ఒకరకంగా.. కూటమిలోని పార్టీలకు మరో రకంగా చాలా ముఖ్యమైనవనే చెప్పాలి! ఈ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలిస్తే… ఇక మరో మూడు, నాలుగు సార్లు వరుసగా గెలిచే అవకాశాలు ఉంటాయని.. ఏపీలో ప్రతిపక్షం నామమాత్ర పరిస్థితికి చేరిపోతుందని భావిస్తుందని అంటున్నారు. ఇదే క్రమంలో… ఈసారి గెలవకపోతే నిలవడం ఆల్ మోస్ట్ కష్టం అనే ఆలోచనతో కూటమిలోని టీడీపీ, జనసేనలు తీవ్రంగా పోరాడుతున్నాయని చెబుతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… గోదావరి జిల్లా ఓటర్లు ఎమోషనల్ గా ఓటు వేయరు.. పక్కా ప్లానింగ్ తో వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తారు అనే పేరుంది! ఉదాహరణకు 2014లో జగన్ వైపు మొగ్గు చూపుతారు అని చాలా మంది అనుకున్నా.. గోదావరి జిల్లా ప్రజలు మాత్రం డిఫరెంట్ గా ఆలోచించారు. చంద్రబాబుపై ప్రేమ ఎక్కువగా ఉందా.. జగన్ పై ధ్వేషం ఉందా అనేది పాయింట్ కాలేదు.. చంద్రబాబు అనుభవం, మోడీ సహకారం రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించారు.

దీంతో 2014లో కూటమికి గంపగుత్తగా ఓటు వేశారు.. అధికారంలోకి రప్పించారు! అయితే.. అది తన టాలెంట్ అని పవన్ అనుకుంటే.. అది తన రాజకీయ చాణక్యం అని చంద్రబాబు భావించి ఉండొచ్చు! అయితే… ఆ నమ్మకాన్ని.. అభివృద్ధి చేస్తానంటూ, గ్రాఫిక్స్ లో అద్భుతాలు చూపించిన చంద్రబాబు.. ప్రశ్నిస్తానని చెప్పి ప్లేట్ ఫిరాయించిన పవన్ కల్యాణ్ చేజేతులా నాశనం చేస్కున్నారనే అభిప్రాయం ఉంది!

ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఆ రెండు పార్టీల జెండాలనూ గోదావరి జిల్లాల జనాలు మడతపెట్టేశారు. దీంతో… వార్ వన్ సైడ్ అయిపోయింది. వైసీపీకి మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ 27 సీట్ల దాకా దక్కాయి. గోదావరి జిల్లాల్లో ఫ్యాన్.. గిరా గిరా తిరిగింది! అయితే ఆ తర్వాత ఐదేళ్లూ జగన్ 2019 ఎన్నికల్లో చెప్పిన మాటలకూ.. చేతలకూ ఏ మేరకు పొంతన ఉందనే విషయాన్ని తీవ్రంగా పరిశీలించారని అంటున్నారు.

ఈ సమయంలో వైఎస్ జగన్ సుమారు 90శాతానికి పైగా హామీలను అమలు చేశారనే చర్చ తెరపైకి వచ్చింది! పైగా… కులం చూసో, మతం చూసో, ప్రాంతం చూసో కాకుండా… తన ప్రభుత్వ హయాంలో మీ మీ ఇంటికి మేలు జరిగితేనే ఓటు వేయాలని సూటిగా కోరుతున్నారు. అంటే… తాను 2019లో ప్రజలకు హామీ ఇచ్చినట్లుగా పాలన చేసి ఉండకపోతే తనకు ఓటు వేయొద్దని చెబుతున్నారు!

దీంతో… ఇది సాహసంతో కూడుకున్న మాట అని ఒకరంటే… నిజాతీతో కూడుకున్న రాజకీయం అని మరొకరు అంటున్నారు. ఇదే సమయంలో… 2014లో తన పాలనను చూసి ఓటు వేయండి.. అదే పాలన మళ్లీ అందిస్తాను అని చెప్పే ధైర్యం చంద్రబాబు చేయడం లేదు, చంద్రబాబుకు ఆ ధమ్ము ఉందా అని జగన్ చెబుతున్న మాటలు కూడా గొదావరి జిల్లా జనాలను బాగా కదిలించాయని.. ఆలోచించచేస్తున్నాయని అంటున్నారు.

దీంతో… గోదావరి జిల్లాల్లో 2019 నాటి ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ గత కొన్ని రోజుల నుంచి మొదలైందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది! “అభిమానం వేరు – బాధ్యత వేరు” అనే చర్చ బలంగా సాగుతుందని అంటున్నారు. దీంతో… 2004, 2009లో వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రెండోసారి అధికారంలోకి వచ్చిందో అదే తరహాలో జగన్ కి రెండోసారి అవకాశం ఇవ్వబోతున్నారని పరిశీలకు అభిప్రాయపడుతున్నారు.