Bheemla Nayak : ప్రెజెంట్ టాలీవుడ్ ఆడియెన్స్ ఓ భారీ సినిమా కోసం చాలా ఆకలిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్స్ లో సరైన సినిమా పడితే జాతర షురూ చెయ్యాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ జాతర అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి ల “భీమ్లా నాయక్” తోనే మొదలవుతుందని చెప్పాలి..
దీనితో ఈ సినిమా కోసం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు ఈ సినిమా ఈ ఫిబ్రవరి 25నే రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది. అయితే ఇంతకు ముందు ఏపీలో అనేక చిక్కులు ఉండగా వాటిని అధిగమించి ఫైనల్ గా లైన్ క్లియర్ చేసుకొని సిద్ధం అయ్యింది. సరే ఇక్కడ అంతా బాగుంది అనుకుంటే లాస్ట్ చేసి తెలంగాణా లో సమస్య స్టార్ట్ అయ్యినట్టు తెలుస్తుంది.
ఇక్కడేమిటంటే.. తెలంగాణాలో టికెట్ ధరలు అంతా బాగానే ఉన్నా సినిమా టికెట్ బుకింగ్స్ పైనే ట్విస్ట్ చేరింది. ఈ సినిమా ఆన్ లైన్ టికెట్స్ బుక్ మై షో లో గాని జస్ట్ టికెట్స్ లో గాని అందుబాటులో ఉండవట. కేవలం థియేటర్స్ లోనే వెళ్లి తీసుకోవాలట. అంటే పాత రోజుల్లో లా కౌంటర్లు దగ్గరే బారులు తీరి తీసుకోవాలట.
ఇది ఊహించని ట్విస్ట్ అని చెప్పాలి. ఈ ఆన్ లైన్ బుకింగ్స్ వారు భీమ్లా నాయక్ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ తో జరిగిన డిస్కషన్స్ తర్వాత ఇలా చేశారట. ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. మరి ఇంకా కొన్ని రోజులు ఉంది ఈ గ్యాప్ లో ఏమన్నా మారుతుందో లేదో చూడాలి. సో తెలంగాణా వాళ్ళు అయితే కాస్త ముందే ప్రిపేర్డ్ గా ఉండండి.
