Health Tips: గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తాగుతున్నారా? అయితే ఈ విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి..!

Health Tips: సాధారణంగా ప్రతి రోజు ఉదయం నిమ్మరసం కలిపిన నీళ్లు తాగటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ నిమ్మరసం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గర్భంతో ఉన్న మహిళలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు సిట్రస్ పండ్లను తీసుకోవడం కూడా చాలా అవసరం. గర్భంతో ఉన్న మహిళలు నిమ్మరసం తాగటం వల్ల కలిగే ఉపయోగాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గర్భిణీ స్త్రీలు సిట్రస్ కలిగిన పండ్లు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గర్భిణీ స్త్రీలు తరచూ నిమ్మరసం తాగడం వల్ల శరీరం డీహైడ్రషన్ కి గురి కాకుండా కాపాడుతుంది.

గర్భంతో ఉన్న సమయంలో సాధారణంగా చాలామంది మహిళలకు తరచూ వాంతులు విరేచనాలు అవుతూ ఉంటాయి. అందువల్ల నిమ్మ రసం తాగితే ఈ సమస్యల నుండి విముక్తి లభించడమే కాకుండా.. అజీర్తి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

నిమ్మ రసంతో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల అందులోనీ యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తినీ పెంపొందిస్తాయి. గర్భిణీ స్త్రీ మరియు గర్భంలో పెరుగుతున్న శిశువు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో ఉపయోగపడతాయి.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల పాదాల వాపులు, బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలు కూడా నియంత్రణలో ఉంటాయి.