ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. మీరు జీవితంలో అస్పత్రికి వెళ్లరు!

కలోంజి అనేది ఇది చాలా మందికి తెలియని విషయం. దానివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పూర్వకాలంలో కలోంజి విత్తనాలు ఎక్కువగా లభించేవి. కానీ ప్రస్తుత కాలంలో చాలామందికి వాటి గురించి తెలియదు. కలోంజీ విత్తనాలు వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు. పూర్వకాలం నాటి ఆహార పద్ధతులను పాటిస్తూ వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వాటిలో కలోంజి పాలు ఒకటి. కలోంజి విత్తనాలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. వీటిలో ఐరన్, క్యాల్షియం, భాస్వరం విరివిగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉంటాయి. కలోంజీ విత్తనాలను దోరగా వేయించి వాటిని పొడిచేసి ఉంచుకోవాలి.

ప్రతిరోజు ఒక గ్లాసు వేడిపాలలో ఈ పొడిని కలుపుకుని తాగితే ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల దగ్గు, జలుబు, తలనొప్పి వంటి వ్యాధులు దరిచేరవు. పాలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పాలలో కలోంజి పొడిని కలుపుకొని తాగటం వల్ల శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చి అలసట ,నీరసంగా ఉండటం వంటి వాటినుండి విముక్తినిస్తుంది. కనుక ప్రతి రోజూ ఒక గ్లాస్ కలోంజి పాలు తాగడం వల్ల ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని చెప్పవచ్చు.