జ‌గ‌న్ చారిత్రాత్మ‌క నిర్ణ‌యం..దేశంలో సంచ‌ల‌న‌మే!

ఏడాది పాల‌నలో భాగంగా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై దృష్టి పెట్టిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాజాగా పారిశ్రామికంగాను ముంద‌డుగు వేసారు. ఇటీవ‌లే పారిశ్రామిక వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన జ‌గ‌న్ రాష్ర్టంలో ప‌లు జిల్లాలో పెద్ద ఎత్తున కంపెనీల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. ఎగ్జిక్యుటివ్ క్యాపిట‌ల్ గా అవ‌త‌రించ‌బోతున్న విశాఖ‌కు పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు రాబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. తద్వారా 33 వేల మందికి ఉపాధి దొరుకుతుంద‌ని తెలిపారు. తాజాగా రాష్ర్టంలో 11 చోట్ల ఫిషింగ్ హార్బ‌ర్లు, ఒక ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ (మేజర్ ఫిషింగ్ హార్బర్), పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం(మేజర్ ఫిషింగ్ హార్బర్), శ్రీకాకుళం జిల్లా బడగట్లపాలెం (మేజర్ ఫిషింగ్ హార్బర్), శ్రీకాకుళం జిల్లాలో మంచినీళ్లపేటలో ఫిష్ ల్యాండ్ నిర్మాణం, విశాఖపట్నం జిల్లా పూడిమడక (మేజర్ ఫిషింగ్ హార్బర్), కృష్ణాజిల్లా మచిలీపట్నం (మేజర్ ఫిషింగ్ హార్బర్), గుంటూరుజిల్లా నిజాంపట్నం (మేజర్ ఫిషింగ్ హార్బర్), ప్రకాశం జిల్లా కొత్తపట్నం (మేజర్ షిఫింగ్ హార్బర్), నెల్లూరు జిల్లా జువ్వలదిన్న (మేజర్ ఫిషింగ్ హార్బర్) లలో ఇవి ఏర్పాటు కానున్నాయి. వీటికి సంబందించి మొత్తం రూ.3500 కోట్లతో నిర్మాణాలు, వసతులు ఏర్పాట్లు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు.

ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం ఓ చారిత్రాత్మ‌క‌మైన‌దిగాను, సంచ‌ల‌నంగానూ చెప్పాల్సిందే. మ‌త్స‌కారులు ఎక్కువ‌గా నివ‌సించే 11 ప్రాంతాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. దీనివ‌ల్ల రాష్ర్టంలో మ‌త్స‌కారులు వ‌ల‌స‌లు వెళ్ల‌డం తగ్గుతుంది. ఇక్క‌డే కావాల్సినంత ఉపాధి దొరుకుతుంది. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు అధికారంలో ఉన్న‌ప్పుడు మ‌త్స‌కారుల ప‌ట్ల నిర్ల‌క్ష ధోరిణి అవ‌లంభించ‌డం వ‌ల్ల ఏపీ నుంచి సుమార్ 25 వేల మంది మ‌త్స‌కారులు జీవ‌నోపాధి కోసం ఏటా వంద‌ల‌మైళ్లు దూరం ప్ర‌యాణించి గుజ‌రాత్ వ‌ల‌స వెళ్లేవారు. జ‌గ‌న్ తీసుకున్న తాజా నిర్ణ‌యంతో ఏపీ మత్స‌కారుల‌కు ఆ తిప్ప‌లు త‌ప్పుతాయి. అలాగే తుఫాన్ల స‌మ‌యంలో మ‌త్స‌కారులు వేట‌కు వెళ్ల‌కుండా ఆర్ధిక స‌హాయాన్ని కూడా ప్ర‌భుత్వం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.