AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. నిత్యం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీకి కుప్పంలో ఎంతో మంచి బలం ఉంది. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పులివెందులలో అదే స్థాయిలో బలం ఉంది . అయితే ఇప్పటివరకు కుప్పం పులివెందులలో పార్టీలు మారిన దాకలాలు లేవు కానీ 2019 ఎన్నికలలో కుప్పం నియోజకవర్గంలో వైసిపి హవా కొనసాగించింది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జడ్పిటిసి ఎన్నికలను కూడా వైసిపి గెలుచుకుంది. దీంతో 2024 ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వై నాట్ కుప్పం అనే స్లోగన్ తెరపైకి తీసుకువచ్చారు.
2024 ఎన్నికలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వై నాట్ కుప్పం వై నాట్ మంగళగిరి వైనాట్ పిఠాపురం అంటూ ఈ మూడు స్థానాలలో కచ్చితంగా విజయం అందుకోవాలని అభ్యర్థులను కూడా ప్రోత్సహించారు. కానీ ఫలితాలు చూస్తే మాత్రం ఇందుకు భిన్నంగా రావడంతో జగన్ కూడా షాక్ లో ఉండిపోయారు. ఇక జగన్ పై రివెంజ్ తీర్చుకోవడం కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు సమయం వచ్చింది పులివెందులలో జడ్పిటిసి ఎన్నికలు జరగడంతో ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించారు.
వై నాట్ కుప్పం అన్న జగన్మోహన్ రెడ్డికే వై నాట్ పులివెందల అంటూ చంద్రబాబు నాయుడు పులివెందులలో చక్రం తిప్పారు. ఇలా గతంలో కుప్పంలో జగన్ గెలవడం వల్ల పార్టీకి కలిగిన లాభమేమీ లేదు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పులివెందులలో గెలవడం వల్ల వచ్చిన లాభం కూడా ఏమీ లేదు కానీ వీరిద్దరి ఇగో సాటిస్ఫాక్షన్ కోసమే ఈ గెలుపు ఓటములని చెప్పాలి. గతంలో కుప్పంలో వైసిపి విజయం సాధించి చంద్రబాబు నాయుడు అహం పై జగన్ దెబ్బ కొట్టారు. సరైన సమయం కోసం ఎదురుచూసిన బాబు కూడా జగన్ అహంపై కోలుకోలేని దెబ్బ కొట్టారని చెప్పాలి. ఇక ప్రస్తుతం పులివెందుల జడ్పిటిసి ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి.
