Not Needed In Districts : పాలనా వికేంద్రీకరణ జిల్లాల్లో అవసరం లేదా.?

Not Needed In Districts

Not Needed In Districts : వైఎస్ జగన్ సర్కారు జిల్లాల పునర్ వ్యవస్థీకరణ విషయంలో ఇరకాటంలో పడినట్లే కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ ఒకే చోట వుండాలని వైఎస్ జగన్, అధికారుల్ని ఆదేశించిన విషయం విదితమే. ఆ దిశగా ఆయా జిల్లాల్లో ఏర్పాట్లు కూడా తాత్కాలికంగా జరిగాయి.. ముందు ముందు శాశ్వత ఏర్పాట్లూ జరుగుతాయి.

జిల్లాల కేంద్రాల విషయంలో జరుగుతున్న ఈ ప్రక్రియ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో ఎందుకు జరగదు.? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో, శాసన రాజధాని అమరావతిలో, న్యాయ రాజధాని కర్నూలులో.. అంటూ వైఎస్ జగన్ సర్కారు చెబుతోంది. ఆ లెక్కన జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం దగ్గర్నుంచి, ఎస్పీ కార్యాలయం.. ఇతర ప్రధాన కార్యాలయాలు వుండకూడదు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఒక్కోటీ వుండాలి.. అన్నది విపక్షాల వాదన.

కేవలం విపక్షాలు మాత్రమే కాదు, ఆయా జిల్లాల్లోనూ ప్రజలు పరిపాలనా వికేంద్రీకరణను కోరుకుంటున్నారిప్పుడు. జిల్లా కేంద్రం ఏదైనా పెట్టుకోండి.. జిల్లాకి సంబంధించిన ముఖ్యమైన కార్యాలయాలు జిల్లా అంతటా విస్తరించండంటూ.. సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తుల రూపంలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీ.. అక్కడే దేశానికి సంబంధించిన ముఖ్యమైన కార్యాయాలున్నాయి. పార్లమెంటు సహా అన్నీ అక్కడే వున్నాయి. తెలంగాణ రాజధాని హైద్రాబాద్ కూడా అంతే. కర్నాటక అయినా, తమిళనాడు అయినా.. ఇంకో రాష్ట్రమైనా అదే పరిస్థితి.

కేవలం మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేవ్ ఏకైక రాజధాని అమరావతిని అయోమయంలో పడేయడం తప్ప, వైఎస్ జగన్ సర్కారుకి రాష్ట్ర భవిష్యత్తుపై చిత్తశుద్ధి లేదన్న విమర్శలకు జిల్లాల విభజనతో మరింత బలం చేకూరినట్టయ్యింది.