Thati kallu: సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో తాటి చెట్లు ఎక్కువగా పెరుగుతుంటాయి. తాటి చెట్ల నుండి లభించే తాటి ముంజలు ,తాటి కళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో తాటి కల్లు తాగటం ,తాటి ముంజలు తినడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది. తాటికల్లు దివ్యౌషధంగా పనిచేసి మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే తాటికల్లుని సరైన సమయంలో తగిన మోతాదులో తీసుకోవడం మంచిది. అలా కాకుండా అమితంగా తీసుకోవడం వల్ల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
తాటి కల్లు చెట్టు నుండి తీసిన వెంటనే తాగటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అలా కాకుండా ఆలస్యంగా తాగితే అది బాగా పులిసిపోయి ఆల్కహాల్ లాగ మారిపోతుంది.తాటి కల్లులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
*తాటి కల్లులో యాంటీఆక్సిడెంట్స్ ఉండటంవల్ల శరీరంలోని ఫ్రీరాడికల్స్, క్యాన్సర్ కణాలను నిరోధించటానికి ఇది సహాయపడుతుంది.
*తాటి కల్లులో విటమిన్ బి, సి ఎక్కువగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగు పడటానికి బాగా దోహద పడుతుంది. తాటి కల్లులో అమైనో ఆమ్లాలు ఉండటం వల్ల శరీర నిర్మాణానికి కూడా తాటి కల్లు ఎంతగానో ఉపయోగపడుతుంది.
*ముఖ్యంగా టైఫాయిడ్, డయేరియా వంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు తాటికల్లు మంచి యాంటిబయాటి్క్ గా పని చేసి ఆ వ్యాదుల నుండి కాపాడుతుంది.
*తాటికల్లులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాదుల బారిన పడకుండా కాపాడుతుంది. తాటికల్లు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయటంలో కూడా ఉపయోగపడుతుంది.