Happy Sleep: రోజంతా పనులతో అలసిపోతాం. కష్టపడిన శరీరానికి నిద్రతోనే విశ్రాంతి. మరి అటువంటి నిద్రను అలక్ష్యం చేస్తే ఎలా? మనిషికి నిద్ర కనీసం ఏడు గంటలు ఉండాలని చెప్తూంటారు డాక్టర్లు. కానీ.. నేడు అదే నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నాం. లేట్ నైట్ పడుకుని ఎర్లీగా నిద్రలేవడం కరెక్ట్ కాదు. లేట్ నైట్ పడుకుని లేట్ గా నిద్రలేవడం కూడా కరెక్ట్ కాదు. అయితే.. కొన్ని అధ్యయనాల ప్రకారం ఖచ్చితంగా ఏడు గంటల నిద్ర కాకుండా మనిషి వయసు, బరువు, రోజూ చేసే పనులు, ఆరోగ్య స్థితిని బట్టి నిద్రపోయే సమయాన్ని నిర్ధారించారు.
సంవత్సరం వయసు అంతకు తక్కువ వయసున్న నెలల పిల్లలు 17 గంటలు నిద్రపోవాలి. 7ఏళ్ల కంటే చిన్న పిల్లలు 10-13 గంటలు నిద్రపోవాలి. 7-19 మధ్య వయసులో 9-11 గంటలు నిద్రపోవాలి. 20-65 ఏళ్ల వయసువారు 7-9 గంటలు నిద్రపోవాలి. 65 ఏళ్లు పైబడ్డవారు 7-8 గంటలు నిద్రపోవాలంటున్నారు నిపుణులు. రోజూ మన పని విధానం, ఆరోగ్య సమస్యలు, కూడా మన నిద్రను నిర్ణయిస్తుంది. చేసే పనిలో అలసట, శ్రమ, పగటి నిద్ర కాఫీ, టీలు అవసరమవుతూ ఉంటే మీకు మరింత నిద్ర అవసరమని గుర్తించాలి. ఎంత హాయిగా నిద్రపోతే అంత ఉత్సాహంగా పని చేయగలం.
సెలవు కదా అని ఆదివారం ఎక్కువసేపు పడుకుంటే సోమవారం బద్దకంగా అనిపిస్తుంది. ఆదివారం టైమ్ ఉపయోగించుకుంటే సోమవారం వర్క్ లో చాలా ఫ్రెష్ గా ఉంటాం. తీసుకునే ఆహారం తక్కువ తీసుకుంటున్నట్టు నిద్రకు తక్కువ టైమ్ కేటాయించడం తగదు. మితంగా తింటే ఆరోగ్యమేమో కానీ.. తక్కువసేపు పడుకుంటే అనారోగ్యమే. చాలామంది తమ పనులకు ఎక్కువ టైమ్ కేటాయించి నిద్రకు తక్కువ టైమ్ కేటాయిస్తారు. ఇది సరైనది కాదు. చేసే పనిలో ఉత్సాహం తగ్గతుంది.
పగలంతా పనిలో అలసిపోవడం వల్ల శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. కండరాలు అలసిపోతాయి. ఇవన్నీ పునరుత్తేజం పొందాలన్నా.. కొత్త కణాలు రూపొందాలన్నా.. మెదడు చురుకుగా పనిచేయాలన్నా నిద్ర ఎంతో అవసరం. నిద్రలేమి శారీరక, మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందంటున్నారు. డయాబెటిస్, హార్ట్ ఎటాక్, నరాల సమస్యలు, ఆందోళన, డార్క్ సర్కిల్స్, చర్మంపై ముడతల సమస్యలు వస్తాయంటున్నారు.
గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.