తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి పేరును రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకైనా పెట్టారా? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అమరులను గౌరవిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీని పూర్తిగా విస్మరించిందని ఆమె తీవ్రంగా విమర్శించారు.
అమరుల పేర్లు విస్మరించి… ఇందిరా, రాజీవ్‌ల పేర్లేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులకు రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ వంటి వారి పేర్లను పెడుతోందే తప్ప, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి వంటి అమరులను గుర్తించడం లేదని కవిత ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ అమరులను విస్మరించి, కాంగ్రెస్ నాయకుల పేర్లనే ప్రాజెక్టులకు పెట్టడంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు.
Raghurama Krishna Raju: ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్‌పై డీవోపీటీకి రఘురామ ఫిర్యాదు
Anchor Shyamala: ‘సోమవారం – పోలవరం’ సంతకు పోయింది.. ఇది ‘మంగళవారం – అప్పుల వారం’: యాంకర్ శ్యామల ఫైర్
నిజమైన త్యాగాలు చేసిన తెలంగాణ బిడ్డల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అందరిపైనా ఉందని ఆమె స్పష్టం చేశారు.
అమరుల ఆశయ సాధన కోసం తెలంగాణ జాగృతి: తెలంగాణ జాగృతి ఎల్లప్పుడూ అమరుల ఆశయ సాధన కోసం, వారి త్యాగాలను స్మరించుకోవడం కోసం నిరంతరం పనిచేస్తుందని కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి త్యాగం ఎంతో మందికి ప్రేరణగా నిలిచిందని ఆమె కొనియాడారు.

