Sajjala Ramakrishna Reddy: 16న గవర్నర్‌కు కోటి సంతకాలు.. లక్ష్యం మించి స్పందన: సజ్జల

Sajjala Ramakrishna Reddy: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘కోటి సంతకాల ప్రజా ఉద్యమం’ కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కోటి సంతకాలను లక్ష్యంగా పెట్టుకోగా.. అంతకుమించి స్పందన వస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఉద్యమ కార్యాచరణ, భవిష్యత్ షెడ్యూల్‌ను వివరించారు.

డిసెంబర్ 16న గవర్నర్‌కు వినతి: ఈ ఉద్యమంలో సేకరించిన సంతకాలను డిసెంబర్ 16న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌కు అందజేయనున్నట్లు సజ్జల వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని అధినేత జగన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని, పార్టీ శ్రేణులు అంతే చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.

Komatireddy Venkat Reddy Warns: పవన్‌కు కోమటిరెడ్డి మాస్ వార్నింగ్: క్షమాపణ చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వం!

Fire Accident In Narsipatnam: అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షాపులు దగ్ధం, భారీ ఆస్తి నష్టం!

కీలక తేదీలు – షెడ్యూల్: సంతకాల సేకరణ, తరలింపు ప్రక్రియకు సంబంధించి సజ్జల నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

డిసెంబర్ 10: నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంతకాలను ఈ తేదీలోగా జిల్లా పార్టీ కార్యాలయాలకు చేర్చాలి.

డిసెంబర్ 13: జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి సంతకాలను పంపించాలి.

ర్యాలీగా తరలింపు: సంతకాలను పంపే ముందు నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ప్రజలు, మీడియా సమక్షంలో వాటిని ప్రదర్శించి, బాక్సుల్లో భద్రపరచాలని సూచించారు. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర కార్యాలయానికి వీటిని ర్యాలీగా తరలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు, పార్టీ అనుబంధ విభాగాలు కీలకపాత్ర పోషించి విజయవంతం చేయాలని సజ్జల పిలుపునిచ్చారు.

చంద్రబాబుపై జగన్ జోకులు || Ys Jagan Sensational Comments On CM Chandrababu Ruling || YCP Vs TDP ||TR