Crime News: కొత్త పద్ధతిలో బంగారం స్మగ్లింగ్.. డిల్లీ విమానాశ్రయంలో అడ్డంగా దొరికిపోయిన నిందితుడు..!

Crime News: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడం వల్ల కొంతవరకు ఉపయోగాలు ఉన్నప్పటికీ.. ఈ టెక్నాలజీ వల్ల అంతే నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలను చూస్తే చాలా మంది ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు. ఎంతోమంది మత్తు పదార్థాలు, బంగారం,వజ్రాలు,వంటివాటిని స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇలా స్మగ్లింగ్ చేసే వారికి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న కూడా స్మగ్లింగ్ కి పాల్పడుతున్నారు. ఇటీవల బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఒక వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు.

వివరాలలోకి వెళితే… ఇటీవల కాలంలో ఎవరికీ అనుమానం రాకుండా కొత్త కొత్త పద్ధతుల ద్వారా కొందరు వ్యక్తులు స్మగ్లింగ్ కి పాల్పడుతున్నారు.ఇలా స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. తాజాగా డిల్లీ విమానాశ్రయంలో 49 లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు బంగారం స్మగ్లింగ్ గురించి సమాచారం అందగా దుబాయ్ నుండి ఢిల్లీ వచ్చిన విమానాన్ని పోలీసులు తనిఖీ చేశారు.

పోలీసులు విమానాన్ని తనకి చేసే సమయంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేయటానికి నిందితుడు పాటించిన కొత్త పద్ధతికి పోలీసులు సైతం అవాక్కయ్యారు. పోలీసులు విమానాన్ని సున్నితంగా పరిశీలించిన తర్వాత నిందితుడు సీటు కింద పరిశీలించగా సిల్వర్ టేప్ తో ఇట్టి ఉన్న దానిని గమనించారు. పోలీసులు దాన్ని తెరచి చూడగా U ఆకారంలో ఉన్న బంగారు కడ్డీ కంటపడింది. వెంటనే పోలీసులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తమదైన శైలిలో నిందితుడిని విచారించగా ఇదివరకే రెండు సార్లు ఇలా బంగారం స్మగ్లింగ్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం ధర దాదాపు 49 లక్షల దాకా ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.