ఐపిఎల్‌తో ఎంజాయ్‌ చేస్తున్న షారూఖ్‌!

గతేడాది వరుస విజయాలతో దూసుకెళ్లిన బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఎంజాయ్‌ చేస్తున్నారు. తన సొంత జట్టయిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కు మద్దతుగా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలో తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇప్పటి వరకూ ప్రారంభించలేదు.

మరోవైపు అభిమానులు మాత్రం షారుక్‌ తదుపరి ప్రాజెక్ట్‌ పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్లు షారుక్‌ తెలిపారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బాద్‌ షా వెల్లడించారు. ‘మూడు సినిమాలతో గతేడాది మొత్తం బిజీగా గడిపాను. శరీరాన్ని చాలా కష్టపెట్టా. అందుకే ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణించుకున్నా. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరవుతానని జట్టుకు మాటిచ్చాను. అందుకే నా తర్వాతి సినిమా షూటింగ్‌ జూన్‌, ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నా. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఎంజాయ్‌ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం చాలా ముఖ్యం. అన్ని మ్యాచ్‌లకూ హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను’ అని షారుక్‌ చెప్పుకొచ్చాడు.

షారుక్‌కు గత ఏడాది బాగా కలిసొచ్చింది. పఠాన్‌, జవాన్‌, డంకీ చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టారు. ఓ అగ్ర హీరో కేవలం ఏడాది వ్యవధిలో మూడు భారీ విజయాలను సొంతం చేసుకోవడం అరుదైన విషమయని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన గతేడాది విజయాన్ని ఆస్వాదిస్తూ.. ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఎంజాయ్‌ చేస్తున్నారు. తదుపరి సినిమాల గురించి మాత్ర ఇప్పటివరకు ఎలాంటి వివరాలు అందించలేదు. దాంతో అభిమానులు కాస్త అసహనంగా ఉన్నారు.d