వధువు సృజన మృతి కేసులో బయటపడ్డ నిజాలు..

ఇటీవలే విశాఖపట్నంలోని మధురవాడ లో వధువు సృజన మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె మరణానికి కారణాలు తాజాగా బయటపడ్డాయి. తన మరణానికి కారణం ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. ఆమె ఫోన్ కాల్, వాట్స్అప్, ఇన్ స్టా గ్రామ్ లను విశ్లేషించగా అందులో కొన్ని విషయాలు బయటపడ్డాయి.

విశాఖ నగరంలో పరవాడ కు చెందిన మోహన్ అనే యువకుడితో ఏడేళ్లుగా ప్రేమలో ఉంది. దీంతో ఇంట్లో తనకి ఇష్టంలేని పెళ్లి చేయడంతో అతడిని పెళ్లి చేసుకోమని కోరడంతో.. అతడు ఆర్థికంగా ఇంకా స్థిరపడలేదని.. దాంతో కొంత సమయం కావాలని కోరాడు. దీంతో ఆమెనె ఆ పెళ్లి ఆపడానికి విష పదార్థం తీసుకోగా పెళ్లి పీటలపై కుప్పకూలి ఆస్పత్రిలో మరణించింది. ఇక ఈ విషయం తన ఇన్ స్టా చాటింగ్ ద్వారా బయట పడింది.