హైదరాబాద్ లో మరో దారుణం.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటోడ్రైవర్!

ఇప్పటికే జూబ్లీహిల్స్ ఘటన అందరినీ కలకలం రేపింది. ఆ ఘటన గురించి మరువకముందే అక్కడే మరో ఘటన చోటుచేసుకోగా అది ఇంకా వెలుగులోకి రాలేదు. తాజాగా ఎల్బీనగర్ లో మరో ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్ లో తొమ్మిదేళ్ల బాలికపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ ఆటో డ్రైవర్ బాలికను బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆటో డ్రైవర్ పై బాధితురాలి తల్లిదండ్రులు ఎల్బినగర్ పీఎస్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆటో డ్రైవర్ ను అరెస్టు చేశారు. అతడు పాతబస్తీకి చెందిన సలీం అని వివరాలు బయట పెట్టారు. ఇతడికి కఠినంగా శిక్షలు విధించాలి అని పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేశారు.