భార్యకు ప్రభుత్వ ఉద్యోగం.. తట్టుకోలేక చెయ్యి నరికేసిన భర్త!

మామూలుగా ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం రావాలని అనుకుంటారు. తమకు రాకుండా కూడా తమ ఇంట్లో వారికి వచ్చినా కూడా సంతోష పడతారు. కానీ తాజాగా ఒక భర్త తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అని తన చెయ్యి నరికేశాడు. పశ్చిమబెంగాల్లో తూర్పు బర్ధమాన్ జిల్లా కొజల్సా గ్రామానికి చెందిన షేర్ మహమ్మద్, రేణు ఖాతున్ భార్య భర్తలు.

ఇక ఆమె దుర్గాపూర్ లోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో నర్సింగ్ శిక్షణ తీసుకోగా.. ఇటీవల తనకు ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమె ఉద్యోగం చేయడం తన భర్తకు ఇష్టం లేకపోవడంతో వారికి గొడవలు జరిగాయి. దీంతో అతడు కోపంతో తన భార్య కుడిచేయి నరకగా ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు పరారీలో ఉన్నట్లు తెలిసింది.