మద్యం మత్తులో ఒకరిని బలి తీసుకున్న యువతలు..

ఈమధ్య అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా మితిమీరి ప్రవర్తిస్తున్నారు. అబ్బాయిల కంటే ఎక్కువగా డ్రింక్ చేస్తూ రోడ్లపై మితిమీరి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు దారితీస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇద్దరు యువతులు కూడాvమద్యం మత్తులో బాగా హల్ చల్ చేశారు.

హరియాణాలోని అంబాల లోని దిల్లీ – అమృత్ సర్ జాతీయ రహదారిపై మోహ్డా ధాన్యం మార్కెట్ వద్ద శనివారం రోజు ఓ ఇద్దరు యువతులు మద్యం సేవించి రేంజ్ రోవర్ కారును మితిమీరిన వేగంతో నడిపి రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీ కొట్టారు. దీంతో అందులో ఉన్న మోహిత్ శర్మ అనే 39 ఏళ్ల వ్యక్తి మరణించగా ఆయన భార్య, ఇద్దరు పిల్లలు కూడా గాయపడ్డారని తెలిసింది. ప్రస్తుతం ఆ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.