డయాబెటిస్ తో భాధపడేవారు తీసుకోవాల్సిన ఆహార నియమాలు

Food details for diabetes patients

డయాబెటిస్ లేదా బ్లడ్ షుగర్ సమస్య తినే ఆహారం నుండి వస్తుంది. కాలక్రమేణా రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. డయాబెటిస్‌ కు నివారణ లేనప్పటికీ, మీరు మీ డయాబెటిస్‌ ను కంట్రోల్ లో ఉంచుకుని ఆరోగ్యంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు. అధిక కేలరీలు మరియు కొవ్వును తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలో పెరుగుదల కనిపిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ని అదుపులో ఉంచుకోకపోతే అది హైపర్‌గ్లైసీమియా వంటి తీవ్రమైన సమస్యకు దారితీస్తుంది. ఒకవేళ స్థిరంగా ఉంటే నరాలు, మూత్రపిండాలు మరియు గుండె దెబ్బతినడం వంటి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది.

Food details for diabetes patients
 

ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఎంపిక చేయడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, చేపలు మరియు మంచి కొవ్వులు లభించే వాటిని ఎంచుకోవాలి. ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కూరగాయలు, పండ్లు, నట్స్, బీన్స్, బఠానీలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. గుండెకు ఆరోగ్యకరమైన చేపలను వారానికి కనీసం రెండుసార్లు తినండి. సాల్మన్, మాకేరెల్, ట్యూనా మరియు సార్డినెస్ వంటి చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె జబ్బులను నివారించడానికి సహాయపడతాయి.

తినే పదార్ధాల జాబితా నుండి పంచదార, స్వీట్స్, కూల్ డ్రింక్స్ ను పూర్తిగా తొలగించండి. అధిక కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు, గొడ్డు మాంసం, హాట్ డాగ్‌లు, సాసేజ్ మరియు బేకన్ వంటి జంతు ప్రోటీన్‌లను నివారించండి. ప్రాసెస్ చేసిన స్నాక్స్, కాల్చిన వస్తువులను నివారించండి. అధిక కొవ్వు పాల ఉత్పత్తులు మరియు అధిక కొవ్వు జంతు ప్రోటీన్లు, గుడ్డు సొనలలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. రోజుకు 200 మిల్లీగ్రాముల (mg) కంటే తక్కువ కొలెస్ట్రాల్‌ ను, రోజుకు 2,300 mg కంటే తక్కువగా సోడియంను తీసుకోండి. అధిక రక్తపోటు ఉంటే వీటిని ఇంకా తక్కువ మోతాదులో ఉండేలా జాగ్రత్తపడండి.