వాయు కాలుష్యంతో చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే ఇలా చేయండి.!

ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలో కూడా ఢిల్లీ వంటి అనేక మెట్రో నగరాలతో పాటు చిన్న చిన్న నగరాల్లో కూడా వాయు కాలుష్య తీవ్రత రోజుకు ఎక్కువవుతుందని అనేక సర్వేల్లో వెల్లడింది. తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా ప్రజలు ప్రమాదకర శ్వాసకోశ వ్యాధులు చర్మ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఈ శీతాకాలంలో వాయు కాలుష్య తీవ్రత కారణంగా
ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు చర్మంపై దద్దర్లు, దురద, మొటిమలు,సోరియాసిస్,చర్మ క్యాన్సర్‌ వంటి వ్యాధులు తలెత్తుతున్నాయి.

తీవ్రమైన వాయు కాలుష్యం చర్మ సమస్యకు ఎలా కారణమవుతోంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాయు కాలుష్యం కారణంగా వెలువడి పాలీసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్‌లు, అస్థిర కర్బన సమ్మేళనాలు, ఆక్సైడ్‌లు చర్మంపై తీవ్ర ప్రభావం చూపి చర్మం లోపల ఉండే లిపిడ్లు, డియోక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్, ప్రొటీన్ల పనితీరులో మార్పులు ఏర్పడుతాయి. ఫలితంగా చర్మ అలర్జీలు తలెత్తి దద్దర్లు ,మంట, వాపు, చర్మ క్యాన్సర్లు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

కాలుష్య తీవ్రత నుంచి బయటపడడానికి ముఖంపై మాస్కులు వాడుతూనే బయటకెళ్ళి వచ్చిన వెంటనే ముఖాన్ని ,చేతులని న్యాచురల్ పద్ధతిలో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మన శరీరంపై ఉండే కాలుష్య కారక రసాయనాలు తొలగిపోతాయి. వీలైతే వారానికి రెండుసార్లు చర్మం లోని మృత కణాలను, మలినాలను తొలగించే ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసేటప్పుడు మృదువైన, వృత్తాకార మసాజ్‌ చేయాలి.

యాంటీఆక్సిడెంట్లను రోజువారీ చర్మ సంరక్షణలో చేర్చవచ్చు. అలాగే శీతాకాలంలో చర్మం పొడిబారకుండా సహజమైన కొబ్బరినూనె బాదం నూనెలను ఉపయోగించాలి. విటమిన్ సి, విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పండ్లు కూరగాయలు డ్రై ఫ్రూట్స్ వంటివి మన రోజు వారి ఆహారంలో తప్పకుండా తీసుకోవాలి. చర్మంపై అలర్జీలు మరీ తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా చర్మవ్యాధి నిపుణులను సంప్రదించాలి.