Megastar : ఇన్సైడ్ టాక్స్ : ఫైనల్ గా మెగాస్టార్ ప్లాన్ సక్సెస్ అయ్యేలా ఉందే..?

Megastar : టాలీవుడ్ మోస్ట్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భారీ సినిమాలు కొన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకే ఓకే క్రేజ్ ని సొంతం చేసుకొని అంతే బాక్సాఫీస్ స్టామినా తో రీఎంట్రీ ఇచ్చిన బాస్ లేటెస్ట్ గా చేసిన చిత్రాల్లో ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రం “ఆచార్య”.

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ భారీ చిత్రంలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించడంతో మన టాలీవుడ్ లో ఇది ఇంకో క్రేజీ మల్టీ స్టారర్ లిస్ట్ లో ఇది చేరింది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తుంది..

మరి ఈ క్రమంలో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చిరు సూచించారు. దీనితో ఆల్ మోస్ట్ అది అవుతుంది అనే టైం లో కరోనా వల్ల ఆగిపోయింది. దీనికి ముందు ట్రిపుల్ ఆర్(RRR) తో చరణ్ కి ఎలాగో మరింత క్రేజ్ వస్తుంది ఆ క్రేజ్ తో ఆచార్య ని కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు.

అయితే అప్పుడు అది ఫెయిల్ అయ్యినా ఇప్పుడు సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది. అయితే ఈ సారి పాన్ ఇండియా లెవెల్లో కాదట. కేవలం తెలుగు హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని తెలుస్తుంది. ఇంకా దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉందని సినీ వర్గాల్లో ఇప్పుడు ఇన్సైడ్ టాక్..