Health Tips: ప్రతి ఒక్క పండు లో ఎన్నో రకాల పోషకాలు దాగి ఉంటాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంతో పాటు ఏదో ఒక రకమైన పండు తినటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అతి తక్కువ ధరలో సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే అరటి పండ్లు సీజన్తో సంబంధం లేకుండా ఏ కాలంలోనైనా అందుబాటులో ఉంటాయి. ఇటువంటి అరటి పండ్లు ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి. ప్రతిరోజు అరటి పండు తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అరటి పండు తో పాటు నెయ్యి కలిపి పరగడుపునే తినటం వల్ల ప్రయోజనాలను పొందవచ్చు. అరటిపండు నెయ్యి కలిపి తినటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తక్కువ బరువుతో బాధపడేవారు ప్రతి రోజూ ఉదయం లేవగానే పరగడుపున అరటి పండు నెయ్యి కలిపి తినడం వల్ల బరువు పెరుగుతారు. అంతే కాకుండా కండరాలు కూడా దృఢంగా తయారవుతాయి. ప్రతిరోజు వ్యాయామాలు చేసేవారు, శారీరక శ్రమ చేసేవారు అరటిపండు నెయ్యి కలిపి తినటం వల్ల శక్తి లభించి రోజంతా హుషారుగా ఉంటారు.
అరటి పండులో ఫైబర్,విటమిన్స్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.ముఖ్యంగా చాలా మంది ప్రతి రోజు భోజనం తిన్న తర్వాత తిన్న ఆహారం జీర్ణం కావడానికి అరటిపళ్లు తింటూ ఉంటారు. అరటి పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచే ఆహారం సరిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అంతే కాకుండా ప్రతి రోజు నెయ్యి,అరటి పండ్లు కలిపి తినడం వల్ల అజీర్తి మలబద్దకం గ్యాస్ ఇటువంటి సమస్యలు తగ్గుతాయి.
ముఖ్యంగా పురుషులు అరటిపండు నెయ్యి కలిపిన మిశ్రమం తినటం వల్ల వారిలో వీర్య కణాల సంఖ్య వృద్ధి అవుతాయి. పురుషులలో శృంగార సామర్థ్యాన్ని పెంచి శృంగార సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజు ఈ మిశ్రమం తినటం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.