Health Tips: మూత్రం ఆపుకుంటున్నారా? జాగ్రత్త ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..!

Health tips: మనిషి శరీరంలో సర్వ సాధారణంగా జరిగే చర్యలలో మూత్రవిసర్జన ఒకటి. శరీరంలోని మలినాలను తనతో పాటు బయటకు తీసుకుపోతుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీలో రాళ్ళుసమస్యతో బాధపడుతుంటారు. మూత్రవిసర్జన ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇది ముఖ్యంగా స్కూల్ పిల్లలు మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకొని మూత్ర విసర్జన చేస్తుంటారు. స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ ని అడగలేక, టీచర్ పెర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల పిల్లలు మూత్ర విసర్జన ను ఆపుకునే ప్రయత్నం చేస్తారు. పెద్దలు మీటింగ్స్ లో ఉండడం, అందరిలో టాయ్లెట్ కి వెళ్ళలేకపోవడం వల్ల లేట్ గా మూత్ర విసర్జన చేస్తుంటారు. ఇలా ఎక్కువసేపు మూత్ర విసర్జనను ఆపుకోవటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా మనిషి శరీరంలో 400 మిల్లీలీటర్ల నుండి 600 మిల్లీమీటర్ల రక్తం కి ఎన్నో పనులు చేయగల సామర్థ్యం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ మూత్రం నిల్వ ఉంచినప్పుడు యూరినరీ బ్లాడర్ పరిమాణం పెరిగి వత్తిడి పెరుగుతుంది. దీంతో బ్లాడర్ నుండి మైండ్ కి సిగ్నల్స్ తగ్గుతాయి. మూత్ర విసర్జన జరగాల్సిన టైంలో జరగకుండా మూత్రాన్ని అలాగే ఉంచడం వల్ల అందులో మలినాలు పెరిగి జిగట ఎక్కువై అది మెల్లగా గట్టిపడుతుంది. ఇవి మెల్లగా రాయి లాగా తయారు అవుతాయి. ఈ పద్ధతిని అలాగే కొనసాగితే ఇంకా బంకగా మారి రాళ్ల పరిమాణం పెరుగుతుంది.

మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కిడ్నీ లో రాళ్ళు, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఆడవారిలో ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే పురుషుల మాదిరిగా మహిళలు ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేయలేరు. దీంతో మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటారు. ఈ అలవాటు వల్ల వచ్చే మరొక సమస్య యూరినరీ ఇన్ఫెక్షన్. ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళలో ఎక్కువ. ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ తో బాధపడేవారు మాటిమాటికీ మూత్రం పోస్తుంటారు. మూత్రం పోసేటపుడు మంటగా ఉంటుంది. ఒకోసారి బ్లాడర్ కాళిగా ఉన్న కూడా మూత్రం వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇది చాలా తీవ్రమైన సమస్య. మూత్రంలో రక్తం కూడా వస్తుంది. జ్వరం, వెన్ను నొప్పి సమస్యలు కూడా వస్తాయి. అందుకే ద్రవ పదార్థాలను ఒక పద్దతి ప్రకారం తీసుకోవాలి. బస్సుల్లో దూరం ప్రయాణాలు చేసేటపుడు, ఏవైనా మీటింగులు ఉన్నపుడు, మూత్ర విసర్జన చేసే సమయం లేని పరిస్థితులలో నీరు తక్కువ తాగడం మంచిది. నీరు ఎక్కువ సమయం తాగాకపోవడం లేదా తక్కువ నీరు తాగడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.