Banana Benifits: పచ్చి అరటి పండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Banana Benifits: సీజన్ తో సంబంధం లేకుండా ఏ సీజన్ లో అయినా లభించే పండు ఏదైనా ఉందంటే అది అరటిపండు. అరటిపండు ప్రతిరోజు ఎంతో ఇష్టంగా తినే వారు అనేకం. ఇది మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక అరటి పండు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరవని డాక్టర్లు చెపుతుంటారు. అరటి పండు తినడం వల్ల శరీరానికి అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయి. అయితే మనం అందరం ఎక్కువగా అరటి పండ్లను మాత్రమే ఎక్కువగా తినడానికి ఇష్ట పడతాము. కానీ, అరటి కాయలో కూడా అనేక పోషక పదార్థాలు ఉంటాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అరటిపండు లేదా కాయలను తరచుగా తినడం వల్ల మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. వీటిలో పోషకాలు, ఫైబర్ ఎక్కువ స్థాయిలో లభిస్తాయి. నిత్యం ఒక అరటి పండు ను తినడం వల్ల శరీరానికి అవసరమైన మెగ్నీషియం,జింక్, పాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు లభిస్తాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అరటి పండ్లను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడటమే కాకుండా, శరీర బరువును కూడా తగ్గిస్తాయి. ఒంట్లో ఉండే మలినాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. పచ్చి అరటిని బాగా ఉడకపెట్టి, దాని మీద కాస్త ఉప్పు వేసుకొని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పచ్చి అరటి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయజనాలు గురించి తెలుసుకుందాం.

• పచ్చి అరటి లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఫలితంగా గుండె ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
• పచ్చిచి అరటి లో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి ముఖం మీద ఉన్న మచ్చలు పోగొట్టి, చర్మాన్ని మృదువుగా, అందంగా ఉంచుతుంది.
• పచ్చి అరటి లో ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణ క్రియ ను మెరుగు పరచడమే కాకుండా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగుగా ఉంటే, తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యి ఆరోగ్యంగా ఉంటారు.

• పచ్చి అరటి లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహ రోగులకు డయాబెటిక్ సమస్య నుండి ఉపశమనం పొందడం సహాయపడతాయి.