Health Benefits: మందారం చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Health benefits: సాధారణంగా మందార చెట్లు పల్లెటూర్లలో ప్రతి ఇంటి దగ్గర కనిపిస్తూ ఉంటాయి. మందార పువ్వులు వాటి ఆకులు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.మందార ఆకులను, పువ్వులను ఆయుర్వేదంలో కొన్ని రకాల వైద్య నివారణ కోసం ఉపయోగిస్తారు. కొన్ని దేశాలలో మందార ఆకులు పువ్వులతో వంటలు, పానీయాలు తయారు చేసుకోవడానికి కూడా వినియోగిస్తారు. మందార ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆయుర్వేదంలో మందారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మందార ఆకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్యలను నివారిస్తుంది. హైబీపీ తో బాధపడేవారు మందార ఆకులు టీ తాగటం ఎంతో శ్రేయస్కరమని డాక్టర్లు సూచిస్తుంటారు. ఒక అధ్యయనం ప్రకారం మందారం టీ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ నివారించి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంపొందిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. ఆకలి వేయకపోవడం, సాధారణ జలుబు, ఎగువ శ్వాసకోశ నొప్పి, కడుపు లో చికాకు, గుండె, ఇతర నరాల సమస్యల నివారణకు మందారం ఆకులు, మందార పువ్వులు ఎంతో ప్రభావితం గా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.

కొన్ని నేచురోపథ్స్ ప్రకారం, మందారం టీ లో సహజంగా లభించే పండ్ల ఆమ్లాలు ఎక్కువ శాతంలో ఉంటాయి. దీని కారణంగా మలబద్దకం సమస్యను తొలగిస్తుంది.మందార టీ ని క్రమంతప్పకుండా తాగడం వల్ల ప్రేగు కదలికలను క్రమబద్దీకరించడమే కాకుండా సాధారణ జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మందార ఆకులు, పూలలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో లభిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడి కడుపు క్యాన్సర్, లుకేమియా వంటి కొన్ని రకాల క్యాన్సర్ల బారినపడకుండా శరీరానికి రక్షణ కల్పిస్తుంది

మందార టీ లో విటమిన్ సి, ఇతర విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తి పూర్తిస్థాయిలో లభ్యమవుతుంది. ఫలితంగా జలుబు, ఇతర ఫ్లూ ల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. మందారం టీ శరీర బరువును తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సహజంగా ఆకలిని తగ్గించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.