వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీ, గణపతి విగ్రహాలను ఏ దిశలో పెట్టాలో తెలుసా?

హిందువులు వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతారో మనం ఏ పని చేసిన లేదా మన ఇంట్లో ఎలాంటి వస్తువులను అమర్చుకోవాలన్నా తప్పనిసరిగా వాస్తు శాస్త్రాన్ని అనుసరించి వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క పనిని చేస్తాము.ముఖ్యంగా మన ఇంట్లో పూజ గదిలో దేవుడు ఫోటోలు పెట్టేటప్పుడు కూడా వాస్తు శాస్త్రాన్ని పాటించాలని చెప్పాలి. చాలామంది వారికి అనుగుణంగా ఇంట్లో పూజ గదిలో దేవుళ్ళ ఫోటోలను పెడతారు.అయితే సంపదకు అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి ఫోటోని అలాగే విజ్ఞాలను తొలగించే వినాయకుడి ఫోటోని ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకుంటారు. ఇలా ఈ రెండు దేవుళ్ళ ఫోటోలు సరైన దిశలో పెట్టినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయని లేకపోతే ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద రావాలంటే ముందుగా జ్ఞానం ఉండాలని ముందుగా వినాయకుడిని పూజించి అనంతరం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. కనుక ఈ ఇద్దరు సంపదకు మూలకారులని భావిస్తారు.ఇక లక్ష్మీదేవి వినాయకుడి విగ్రహాలను తూర్పు దిశ వైపు పెట్టడం వల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఇకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా వినాయకుడికి ఎడమవైపు పెట్టి పూజించకూడదు.సాధారణంగా హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఒక పురుషుడికి ఎడమవైపు కేవలం తన భార్య మాత్రమే ఉండాలి.వినాయకుడికి లక్ష్మీదేవికి తల్లి కొడుకుల అనుబంధం ఉంది కనుక ఎట్టి పరిస్థితులలో కూడా వినాయకుడికి ఎడమవైపు లక్ష్మీదేవిని పెట్టి పూజ చేయకూడదు. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.