SVSN Varma: పిఠాపురం వర్మ నిజంగా వైసీపీకి దగ్గరయ్యారా?

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్‌ఎన్ వర్మ ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా చర్చల కేంద్రంగా మారారు. మొన్నటి ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ గెలుపుకు తానే అన్నట్టు మద్దతు ఇచ్చిన వర్మ, పార్టీ ఆదేశానుసారంగా పోటీకి దూరంగా ఉన్నారు. పవన్‌కు భారీ మెజారిటీ రావడంలో వర్మ ప్రచారం, వ్యక్తిగత ప్రభావం ఎంతో సహకరించిందని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆయనపై టీడీపీపై అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం ప్రారంభమైంది.

వర్మను ఎమ్మెల్సీగా పంపిస్తానన్న చంద్రబాబు హామీ నెరవేరకపోవడమే ఈ చర్చలకు బీజం వేసిన అంశం. రెండు దఫాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వర్మకు అవకాశం రాకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న మాట ప్రచారంలోకి వచ్చింది. మరోవైపు, నాగబాబుకు ఎమ్మెల్సీ ఛాన్స్ రావడం వర్మ వర్గంలో అసహనానికి దారితీసిందని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ వర్గాలు వర్మ టీడీపీని వదిలేస్తారని ఊహించుకోవడం మొదలుపెట్టాయి.

ఇంతకీ వర్మ నిజంగా వైసీపీకి దగ్గరయ్యారా? ఇందుకు కారణంగా ఇటీవల ఆయన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టే చర్చకు కేంద్రంగా మారింది. పిఠాపురంలోని ఓ మురికి కాలువ ఫొటోను షేర్ చేసి, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వర్మకు పాలకపక్ష నేతగా వ్యవహరిస్తున్నారనే కామెంట్లు మొదలయ్యాయి. వెంటనే వైసీపీ సోషల్ మీడియా వర్మపై హ్యాండిల్ తీసుకుంది. “వర్మకు టికెట్ ఇస్తారు”, “గీతకు రాజమండ్రి ఎంపీ టికెట్ ఖాయం” అంటూ ఊహాగానాల ఊదరగొట్టే పోస్టులు రావడం మొదలైంది.

అయితే ఈ ప్రచారం వైసీపీ యాక్టివిస్టుల్లోనే చిచ్చు రేపుతోంది. “ఇదేనా నాయకత్వ నిర్ణయం?” అని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో స్పష్టంగా తెలియనప్పటికీ, ఆయన చుట్టూ జరుగుతున్న ఈ మీడియా హడావుడి 2029 ఎన్నికల రాజకీయం ఏ విధంగా మలుపులు తిరుగుతుందో చెప్పే సంకేతాలు ఇస్తోంది.

ఫోటోలు దగ్గరుండి పక్కా ప్లాన్ తో  తీయించింది అతనేనా? | Pastor Praveen Pagadala | Telugu Rajyam