Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ ట్రైలర్ మాత్రమే…. అసలు సినిమా ముందుంది: వేణు స్వామి

Allu Arjun: అల్లు అర్జున్ గత కొద్ది రోజులుగా వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. పుష్ప 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయినప్పటికీ ఆ సంతోషం మాత్రం అల్లు అర్జున్ లో లేదని చెప్పాలి ఈ సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కలాట ఘటన కారణంగా ఈయన ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చారు అయితే ఈయన జాతకం ప్రస్తుతం బాలేదంటూ గతంలో వేణు స్వామి తెలియజేశారు అయితే తాజాగా ఈయన మరొక వీడియో ద్వారా అల్లు అర్జున్ జాతకం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోలో భాగంగా వేణు స్వామి మాట్లాడుతూ అల్లు అర్జున్ జాతకం 2025 మార్చి 30 వరకు ఏమాత్రం బాగలేదనీ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఐటీ రైడ్స్ కు సంబంధించి చాలా మంది అడుగుతున్నారు. అల్లు అర్జున్ ది కన్యారాశి, సుకుమార్ గారిది కుంభ రాశి. వీళ్ల జాతకాలు షష్టాష్టకం కాంబినేషన్. వీళ్ల జాతకంలో ఉన్న శని స్థానాలను బట్టి ఇలా జరుగుతుందని తెలిపారు.

ఈ రెండు కలవడం వల్ల ఒక ఫైర్ లాగా బ్లాస్ట్ అవుతుంది. దీని వల్ల చుట్టుపక్కన వాళ్లు కూడా ప్రభావితమవుతారు. అల్లు అర్జున్ జాతకం ప్రకారం ఆయనకున్న శని స్థానం ప్రకారం ఆయనకు శత్రు స్థానం, రోగ స్థానం ఉన్నాయి. గత సంవత్సర కాలంగా అల్లు అర్జున్ పై శత్రుదాడి పెరుగుతూ వస్తుందని అదే ఆయన అరెస్టుకు కారణమైందని అరెస్టు వల్ల ఆయన మానసికంగా ఎంతో వేదనకు గురి అయ్యారని తెలిపారు.

ఇలా ఎన్నో ఇబ్బందులు పడిన ఈయన ఓ చరిత్ర కూడా సృష్టిస్తారని తెలిపారు. ఇప్పటివరకు అల్లు అర్జున్ పట్ల జరిగిన అరెస్టులు అన్నీ కూడా ఒక ట్రైలర్ టీజర్ లాంటిది మాత్రమేనని అసలు సినిమా ముందు ముందు ఉందని వేణు స్వామి తెలిపారు. మార్చి 30 తర్వాత అసలు సిసలైన అల్లు అర్జున్ స్టార్ ఏంటో చూడబోతున్నాము అంటూ వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.