Y.S.Jagan: తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆదివారం ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రజలందరికీ శ్రీ విశ్వవాసు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం ప్రముఖ అవధాని నారాయణ మూర్తి పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ ఏడాది ఎలా ఉండబోతుందో వివరించారు. గత ఎన్నికలలో ఓటమిపాలైన జగన్మోహన్ రెడ్డి ఎంతో ధైర్యంగా ఉన్నారని అవడానికి తెలిపారు. ఎన్నికల్లో ఓడితే చాలా మంది భయపడతారని అన్నారు.
మిథునరాశిలో జన్మించిన వైఎస్ జగన్‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయని, ఈ ఏడాదంతా బాగుంటుందని పేర్కొన్నారు. అలాగే తెలుగు భాష గొప్పతనం గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శ్రీకృష్ణదేవరాయలు లాగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఇక వైఎస్ జగన్ కుటుంబ సమస్యలు ఈ ఏడాది సమసిపోతాయని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలలో ఓడిపోయిన వచ్చే ఎన్నికలలో మాత్రం అధికారంలోకి వస్తారని తిరిగి ముఖ్యమంత్రి కూర్చి సొంతం చేసుకుంటారు అంటూ అవధాని నారాయణమూర్తి జగన్మోహన్ రెడ్డి జాతకం గురించి జోస్యం చెప్పారు. ఇక ప్రస్తుతం ఈ జాతకం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఇప్పటినుంచి కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.