Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎంతోమంది సినిమా సెలబ్రిటీల జాతకాలను రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ వార్తలు నిలిచారు. అయితే సెలబ్రిటీల గురించి కొన్నిసార్లు ఈయన చెప్పే జాతకం వివాదాలకు కారణం అవ్వడమే కాకుండా ఈయనపై పలు సందర్భాలలో కేసులు కూడా నమోదు అయ్యాయి. ఇలా తనపై కేసులో నమోదు అయినప్పటికీ వేణు స్వామి మాత్రం సెలబ్రిటీల గురించి రాజకీయ నాయకుల గురించి జాతకాలు చెబుతూనే ఉన్నారు.
ఇకపోతే తాజాగా వేణు స్వామి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి జాతకం చెబుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఎంతో గొప్పగా చెబుతున్నారని తెలిపారు. మాలాంటి వాళ్ళు చెబితే కేవలం ఒక పది లేదా 20 మందికి మాత్రమే చేరుతుంది కానీ పవన్ లాంటి వ్యక్తి చెబితే కొన్ని లక్షల మందికి సనాతన ధర్మం గొప్పదనం తెలుస్తుందని తెలిపారు.
ఇక పవన్ కళ్యాణ్ జనాలకు వారాహి అమ్మవారిని పరిచయం చేశారు. ఆయన పెద్ద ఎత్తున అమ్మవారికి పూజ చేయటమే కాకుండా తన వాహనానికి కూడా వారాహి అనే పేరును పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని పూజించటం వల్లే ఆయనకు ఎంతో అద్భుతమైన విజయాలు అందాయని అదృష్టం కలిసి వచ్చిందని వేణు స్వామి తెలిపారు. పవన్ జాతకం ఎంతో గొప్పగా ఉందని ఇకపై తనకు ఓటమి అనేది ఉండదంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
గతంలో పవన్ జాతకం గురించి వేణు స్వామి మాట్లాడుతూ ఎన్నో విమర్శలు చేశారు. ఆయన జాతకం బాగాలేదని ఆయన రాజకీయాలలో సక్సెస్ కాలేరు అంటూ ఎన్నో వ్యాఖ్యలు చేశారు కానీ ఇప్పుడు మాత్రం పవన్ గురించి గొప్పగా మాట్లాడటంతో అభిమానులు తెగ సంబరపడుతున్నారు.