వివాహం ఆలస్యమవుతోందా.. ఈ పూజ చేస్తే కచ్చితంగా పెళ్లి సులువుగా జరుగుతుందట!

Indian wedding hands

దేశంలో చాలామంది సరైన సమయంలో పెళ్లి జరగకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. వేర్వేరు దోషాల వల్ల కొంతమందికి సరైన సమయంలో పెళ్లి కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. గత పదేళ్లలో ఈ సమస్య మరింత ఎక్కువవుతోంది. అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల కూడా పెళ్లి అయ్యే వాళ్ల సంఖ్య అంతకంతకూ తగ్గుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

అన్ని లక్షణాలు ఉన్నా కొంతమందికి పెళ్లి జరగడం లేదు. కుజుడు కళ్యాణ కారకుడు కావడంతో పాటు పిల్లలకు కారకుడు అని చెప్పవచ్చు. కొంతమంది ఎన్ని చేసినా పెళ్లి కావడంలేదని చెబుతుంటారు. శని ప్రభావం ఉండటం వల్ల కూడా కొన్నిసార్లు వివాహం ఆలస్యం అవుతుంది. కుజుడికి జపాలు చేయించడంతో పాటు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చూస్తే మంచిదని చెప్పవచ్చు.

పెళ్లి ఆలస్యం కావడం కర్మ అని పండితులు చెబుతున్నారు. గత జన్మలో చేసిన పాపాల వల్ల ఈ విధంగా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ శిక్షకు బదులుగా ఎవరికి వారు బదులుగా శిక్షను విధించుకుంటే కుజ దోషం బదులుగా కుజ యోగం వస్తుందని పండితులు చెబుతున్నారు. గణపతికి 14 గుంజీలతో మొదలుపెట్టి 108 గుంజీలు 41 రోజుల పాటు కుజునికి సంబంధించిన స్తోత్రం జపిస్తే శుభ ఫలితాలు పొందవచ్చు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పూజలు చేస్తే మాత్రం మనకు కచ్చితంగా మంచి ఫలితాలు పొందవచ్చు. సమీపంలో గుడి లేని వాళ్లు దేవుని మందిరంలో భక్తితో గుంజీలు చేస్తే మాత్రం కచ్చితంగా అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థికంగా కూడా భారీ స్థాయిలో ప్రయోజనాలను పొందే ఛాన్స్ ఉంది.