Coriander Benifits: పచ్చి కొత్తిమీరను తింటున్నారా.. అయితే తప్పకుండా ఇవి తెలుసుకోవాల్సిందే!

Coriander Benifits: మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల పోషక విలువలు ఆకుకూరలలో దాగి ఉంటాయి. ప్రతిరోజు వంటింట్లో ఉపయోగించే ఆకుకూరలలో కొత్తిమిర తప్పకుండా ఉంటుంది. కోతిమీర ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవటంవల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొత్తిమీర వంటలలో వేయటం వల్ల ఆహారానికి మంచి రుచి , సువాసన లభిస్తాయి. కొత్తిమీర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ప్రతిరోజు ఏదో ఒక విధంగా కొత్తిమీర తినడం వల్ల కొత్తిమీరలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మన శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి. కొత్తిమీరలో క్యాల్షియం , మెగ్నీషియం , పొటాషియం , వివిధ రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీరలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల వలన వ్యాధి నిరోధక శక్తి పెరిగి తరచుగా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

కొత్తిమీరలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు , కండరాల నొప్పుల వంటి సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజు పచ్చి కొత్తిమీర తినటం వలన కంటి చూపు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. కొత్తిమీరలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడి మలబద్ధకం , కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి.

డయాబెటిక్ సమస్యతో బాధపడేవారు పచ్చి కొత్తిమీర ప్రతిరోజు ఉదయం తినటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించి వారి సమస్య నుండి విముక్తి పొందవచ్చు. కొత్తిమీరలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ , వైరస్ నుండి మనల్ని కాపాడుతుంది. ప్రతిరోజు కొత్తిమీర తినటం వలన ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కొత్తిమీరలో ఎక్కువగా ఉండటం వల్ల మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.