వంకాయలను ఎక్కువగా తింటున్నారా.. ఈ సమస్యలు తప్పవు!

కూరగాయలు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. కూరగాయలలో వంకాయను రారాజుగా వర్ణిస్తారు. వంకాయ కూర అంటే చాలామంది ఇష్టపడతారు. వంకాయ కూర రుచికి అద్భుతంగా ఉంటుంది. వంకాయలు చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం వంకాయ ఒక విధంగా రుచిని కలిగి ఉంటాయి. వంకాయతో వివిధ రకాల వంటకాలు వండవచ్చు. వంకాయలు ఎక్కువగా తినటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వంకాయలు అప్పుడప్పుడు తినటం ఆరోగ్యానికి మంచిది. కానీ వంకాయలు ఎక్కువగా తినటం వల్ల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకొన్నట్టు ఉంటుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వంకాయ తినకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
అలర్జీ సమస్యతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండటమే మంచిది. వంకాయ తినటం వల్ల వారి సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. కొద్దిమందికి వంకాయ తినడం వల్ల దురద సమస్య మొదలవుతుంది .అటువంటి వారు కూడా వంకాయని తినకూడదు.

ఏదైనా శస్త్రచికిత్స చేసిన తర్వాత వంకాయను తినకూడదని వైద్యులు సూచిస్తారు. ఎందుకంటే వంకాయ తినటం వల్ల చికిత్స జరిగిన ప్రదేశంలో దురద వచ్చే ప్రమాదం ఉంది.ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు వంకాయలు అస్సలు తినకూడదు. వంకాయలు సహజంగా వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా జ్వరం , జలుబు సమస్యలు ఉన్నప్పుడు వంకాయలు అసలు తినకూడదు.
వంకాయలను అప్పుడప్పుడు తినటం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. కానీ ఎక్కువగా వంకాయను తినటం వల్ల శరీరంలో ఆహారం తొందరగా జీర్ణం కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య మొదలవుతుంది. అందువల్ల గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వారు కూడా వంకాయను తినకపోవడం మంచిది.

షుగర్ వ్యాధి తో బాధపడేవారు వంకాయలు ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా వంకాయలు తినటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. రక్తపోటు సమస్య ఉన్నవారు కూడా వంకాయలు ఎక్కువగా తినకూడదు. అలా చేయడం వల్ల వారిలోఅనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.