Saturn Vakri: జూన్ 29న శని తిరోగమనం.. ఈ మూడు రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే?

నవగ్రహాలలో ఒకటైన శని గ్రహాన్ని అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం ప్రభావం ప్రతి ఒక్క రాశిపై పడడంతో పాటు శుభ అశుభ ఫలితాలను కూడా అందిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహం సంచారం చేస్తే అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. అలాగే ఈ గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి సంచారం చేస్తుందన్న విషయం తెలిసిందే. అలాగే అప్పుడప్పుడు ఈ గ్రహం తిరోగమనం, నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. దీని కారణంగా కూడా ప్రత్యేక ప్రభావం ఏర్పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సారి శని గ్రహం జూన్ 29న శని కుంభరాశిలో తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా 3 రాశుల వారికి అనేక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఎప్పటి నుంచో వస్తున్న అడ్డంకులన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి. మరి ఈ సమయంలో ఏఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అన్న విషయానికి వస్తే.. శని వక్రి కారణంగా కుంభ రాశివారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి పనుల్లో వస్తున్న అడ్డంకులు సులభంగా తొలగిపోతాయి. అంతే కాకుండా జీవితంలో పురోగతి కూడా లభిస్తుంది. వీరి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే వ్యాపారంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.

దీంతో పాటు సమాజంలో వీరికి మంచి పేరు కూడా లభిస్తుంది. దీంతో పాటు ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. అదేవిధంగా ఈ శని తిరోగమనం కారణంగా కూడా మేష రాశి వారి జీవితంలో కూడా భారీగా మార్పులు వస్తాయి. కెరీర్‌కి సంబంధించిన ప్రమోషన్ కూడా లభిస్తాయి. అంతేకాకుండా డబ్బు సంబంధించిన విషయాల్లో పురోగతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారు గొప్ప విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు పోటీ పరీక్షలు రాసేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసిన విజయాలు తప్పకుండా సాధిస్తారు. అలాగే శని అనుగ్రహం కారణంగా మిథున రాశి వారు ఊహించని లాభాలు పొందుతారు. వీరికి ఆకస్మిక ధన లాభం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. దీంతో పాటు వీరు దిన దిన అభివృద్ధి కూడా చెందుతారు.