Business Idea: ఈ బిజినెస్ చేస్తే చాలు.. అసలు నష్టం అనేది ఉండదు?

ఈ రోజుల్లో యువత అలాగే ఉద్యోగాలు చేస్తున్న చాలామంది బిజినెస్ లు చేయాలని అనుకుంటున్నారు. ఉద్యోగాలతో పోల్చుకుంటే బిజినెస్ లు ఎన్నో రెట్లు మేలు అనుకోని రకరకాల బిజినెస్లలో మొదలు పెడుతున్నారు. చాలామందికి బిజినెస్ పెట్టాలి అనుకున్నప్పటికీ లాభాలు నష్టాలు పెట్టుబడి ఆర్థిక సమస్యల కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇంకొందరు తక్కువ బడితో ఎప్పటికీ నష్టం ఉండని ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ లు ఏవి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మంచి ఆలోచన, ప్లానింగ్‌తో బిజినెస్‌ ప్లాన్‌ చేస్తే నష్టాలు లేకుండా లాభాలు ఆర్జించవచ్చు.

అలాంటి ఒక బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రస్తుతం మార్కెట్ లో చిప్స్‌కు డిమాండ్ భారీగా ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చిప్స్‌ను ఇష్టంగా తింటున్నారు. ముఖ్యంగా బంగాళదుంప చిప్స్‌ తయారీ యూనిట్ ద్వారా వేలలో ఆర్జించవచ్చు. తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ప్రారంభంలో ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే ఇందుకు కావాల్సిన అనుమతులను మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫుడ్‌ సేఫ్టీ నుంచి సర్టిఫికెట్ కూడా తప్పకుండా ఉండాలి.
మొదట్లో ఇందుకోసం చిన్న చిన్న మిషిన్లు అవసరపడతాయి.

బంగాళదుప్పలను చిప్స్‌గా కట్ చేయడానికి మిషిన్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు స్టవ్‌, గ్యాస్‌, ఆయిల్‌ లాంటివి అవసరపడతాయి. అలాగే చిప్స్‌కు రుచిని ఇచ్చే వాటిలో ప్రధానమైంది అందులో ఉపయోగించే మసాలా. అందుకే మంచి మసాలాను సెలక్ట్ చేసుకోవాలి. ఇక చిప్స్‌ తయారీ పూర్తయిన తర్వాత వాటిని ప్యాకింగ్ చేసేందుకు కూడా కవర్స్‌ అవసరపడతాయి. ముఖ్యంగా మీ సొంత బ్రాండింగ్‌తో కవర్స్‌ను తయారు చేసుకోవచ్చు. చిప్స్‌ ప్యాకెట్ల తయారీ పూర్తయిన తర్వాత మీకు స్థానికంగా ఉన్న దుకాణాల్లో నేరుగా మీరే వెళ్లి విక్రయించవచ్చు. మొదటి చిన్నగా ప్రారంభించి డిమాండ్‌కు అనుగుణంగా ఈ వ్యాపారాన్ని పెంచుతూ పొందవచ్చు. ఇక పెట్టుబడి విషయానికొస్తే చిప్స్‌ తయారీ ప్లాంట్‌ను రూ. 20వేల కనీస పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఆదాయం కూడా నెలకు కనీసం రూ. 10 వేలు పొందవచ్చు. వర్క్‌ ఫోర్స్‌ను పెంచుకొని ఎక్కువ తయారు చేస్తే ఆదాయం రూ. 30 వేల వరకు కూడా పొందవచ్చు. ఈ బిజినెస్ ను ప్రారంభించాలి అనుకున్న వారు ముందుగానే మీకు దగ్గరలో ఉన్న షాప్స్ లో మీ ప్రోడక్ట్ గురించి వారికి వివరించి ఆ తర్వాత బిజినెస్ ను మొదలు పెట్టడం మంచిది.