మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి అవసరమైన విటమిన్లు అన్ని శరీరానికి అందాలి. అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఇది మానవ శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ బి 12 కూడా ఒకటి. కొన్ని రకాల విటమిన్స్ లోపంతో బాధపడుతూ ఉంటారు. ఒకవేళ విటమిన్ బి లోపం ఉంటే అలాంటప్పుడు ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..విటమిన్ B12 శరీరానికి అవసరమైన అన్ని పోషకాలలో కూడా ఉంటుంది. ఇది నీటిలో కరిగే విటమిన్. అందువల్ల శరీరానికి ప్రతిరోజూ అవసరం. విటమిన్ బి12 న్యూరోట్రాన్స్మిటర్ సంశ్లేషణలో భాగంగా ఉండటం ద్వారా మానసిక స్థితి, శరీర పనితీరును నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఇది ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి, రక్తహీనత నివారణకు, శరీరానికి ఆక్సిజన్ సరఫరాలో కూడా సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు. విటమిన్ బి 12 అంటే కోబాలమిన్ నాడీ వ్యవస్థను కూడా నిర్వహిస్తుంది. శరీరంలో ఈ విటమిన్ లోపం వల్ల అనేక సమస్యలు మొదలవుతాయి. అలాంటప్పుడు పరిస్థితిలో వివిధ విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవడంతో పాటు ఈ ఆహారాలను తినడం ప్రారంభించాలి. అయితే ఇది వివిధ వయస్సులు, అవసరాలపై ఆధారపడి ఉంటుంది. 18 ఏళ్ల లోపు యువకుడికి 0.4 మైక్రోగ్రాముల నుంచి 1.8 మైక్రో గ్రాముల విటమిన్ బి12 అవసరం. ఒక వయోజన వ్యక్తికి 2.4 మైక్రోగ్రాములు అవసరం. గర్భిణీ, పాలిచ్చే తల్లులకు 2.8 మైక్రో గ్రాములు అవసరం. శాకాహారులు విటమిన్ బి12 లోపాన్ని తీర్చడం కష్టం.
విటమిన్ బి12 చికెన్, టర్కీ, జిడ్డుగల చేపలు, పీతలు, గుడ్లు, గుడ్డు పచ్చసొన వంటి పదార్థాలలో ఉంటుంది. అలాగే ఈ బి12 పాల పదార్థాలలో కూడా లభిస్తుంది. చీజ్‌లో విటమిన్ బి 12 కూడా ఉంటుంది. 22 గ్రాముల చీజ్ ముక్కల్లో 28 శాతం విటమిన్ బి12 ఉంటుంది. పూర్తి కొవ్వు సాదా పెరుగులో మంచి మొత్తంలో విటమిన్ బి12 ఉంటుంది. విటమిన్ బి 12 లోపించిన వ్యక్తులు పెరుగు తినాలి. ఈ రోజుల్లో పూర్తి కొవ్వు పాలు, పాల ఉత్పత్తులకు బదులుగా, ప్రజలు సోయా పాలు, బాదం పాలు, బియ్యం పాలు తాగడానికి ఇష్టపడతారు. మార్కెట్‌లో లభించే ఫోర్టిఫైడ్ బాదం పాలు, సోయా పాలలో విటమిన్ బి12 మంచి మొత్తంలో ఉంటుంది. ఒక కప్పు బలవర్ధకమైన సోయా పాలు రోజువారీ విటమిన్ బి12 86 శాతం అందిస్తుంది.