మాములుగా మనకు వేసవికాలంలో ఎన్నో రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. వాటిలో మామిడి పండ్లు కూడా ఒకటి. ఈ పండ్లు మనకు వేసవికాలంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. వేసవిలో మామిడి పండ్ల కోసం ఏడాది మొత్తం ఆశగా ఎదురు చూసే వారు మనలో చాలా మంది ఉన్నారు. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీ ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఇంత వేడిలో మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా అని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి, ఈ సీజనల్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ పండ్లను తినే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
మార్కెట్‌లో మామిడి పండ్లను కొన్న తర్వాత బాగా కడగడం మర్చిపోకూడదు. అంతకంటే ముందు ఒక గంట పాటు నీళ్లలో వీటిని నానబెట్టాలి. పండిన మామిడి పండ్లను ఎల్లప్పుడూ నీళ్లలో నానబెట్టాలి. మరి ఇలా చేయడం వలన ఇలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామిడి తొక్కలో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియంట్ ఉంటుంది. ఈ ఫైటిక్ యాసిడ్ శరీరానికి హానికరం అని చెప్పవచ్చు. ఇది శరీరం పోషకాలను గ్రహించకుండా నిరోధిస్తుంది. ఫైటిక్ యాసిడ్ ఐరన్, జింక్, కాల్షియం వంటి ముఖ్యమైన మూలకాల శోషణను నిరోధిస్తుంది. మామిడి పండ్లను నీటిలో నాన బెట్టడం వల్ల ఈ ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది.
అంతేకాకుండా మామిడి తొక్కలో చాలా హానికరమైన పదార్థాలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలుకు బదులు కీడు చేస్తాయి. చర్మం కూడా సమస్యలకు గురవుతుంది. అలాగే మొటిమలు, దద్దుర్లు, ప్రేగు సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు నివారించడానికి మామిడి పండ్లను నీటిలో నానబెట్టాలి. అలాగే ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చాలావరకు పనిలో రసాయనాలతోనే పండించినవి. ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి పురుగుమందులు వినియోగిస్తున్నారు. మామిడిపండ్లపై కూడా అనేక రకాల రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. అవి శ్వాసలోపం, వికారం, తలనొప్పి సమస్యను పెంచుతాయి. మామిడికాయలను ఒక గంటపాటు నీటిలో నానబెట్టడం వల్ల ఈ హానికరమైన అంశాలు తొలగిపోతాయి. మామిడికాయ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అయితే వేసవిలో శరీరాన్ని ఎంత చల్లగా ఉంచుకుంటే అంత మంచిది. బదులుగా మామిడికాయలను నీటిలో గంటసేపు నానబెట్టడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. అలాగే మామిడిలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఈ రసాయనం శరీరంలో కొవ్వును పెంచుతుంది. అందుకే మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టాలి.