మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు కలలు రావడం అన్నది సహజం. అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడ్డ కలలు. అయితే కొంతమందికి పీడ కలలు తరచుగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది ఆందోళన చెందుతూ భయపడుతూ ఉంటారు. ఇది స్వప్న శాస్త్ర ప్రకారం కలలు భవిష్యత్తును సూచిస్తాయని చాలామంది చెబుతూ ఉంటారు. ముఖ్యంగా తరచుగా మనకు కలలో కొన్ని కనిపిస్తుంటాయి. వాటి వల్ల కొన్ని సార్లు సమస్యలు ఎదురైతే కొన్ని సార్లు మంచి కూడా జరగవచ్చు. ముఖ్యంగా కలలో తరచుగా మీకు కొన్ని కనిపిస్తుంటే మంచి రోజులు మొదలు కాబోతున్నట్లే అంటున్నారు పండితులు.
అయితే స్వప్నంలో కనుక ఇంట్లో నల్ల చీమలు కన్పిస్తే మంచి జరుగుతుందంట. నల్ల చీమలు ఒకదానికి మరోకటి సహాయం చేసుకుంటాయి. దీని వల్ల మన జీవితంలో కూడా ఉన్నత స్థానానికి వెళ్తారని చెబుతుంటారు. ఇలా కలలో నల్ల చీమలు కనిపించడం చాలా మంచిది అంటున్నారు పండితులు. అలాగే కొన్ని సార్లు కలలో పక్షులు గూడుకట్టుకుని ఉండంను చూస్తుంటారు. రెండు పక్షులు కష్టపడి తమ గూడును కట్టుకోవడం చూస్తుంటారు. ఇలా కలలో కనిపించడం చాలా మంచిది. అలాగే కలలో గుడ్లగూబలు కూడా కన్పిస్తాయి. గుడ్లగూబను ముఖ్యంగా లక్ష్మీదేవి వాహానంగా భావిస్తారు.
కలలో గుడ్లగూబ కన్పిస్తే ఆకస్మిక ధనలాభానికి సంకేతంగా భావించాలి. అదేవిధంగా కలలో ఏనుగులు కన్పించిన లేదా ఏనుగుల వద్దకు మనం వెళ్లినట్లు కలలో కన్పించిన కూడా ఇప్పటిదాక జీవితంలో ఎదురైన అన్నిరకాల ఇబ్బందులు తొలగిపోయిన మంచి జరుగుతుందని అర్థం. నక్షత్రాలు కన్పించడంను కూడా మంచి శకునంగా భావిస్తారు. కలలో మనకు, ఎవరైన డబ్బులు ఇస్తున్నట్లు కన్పిచడం, నక్షత్రాలు కన్పించడం కూడా మంచిదే.