కాలం మారిపోవడంతో మనుషుల ఆహార అలవాట్లు, జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుత రోజుల్లో జనాలు ఇంట్లో చేసిన వంటకాల కంటే ఎక్కువగా బయట చేసే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చిన్న పిల్లలకు స్నాక్స్ కింద అనేక రకాల జంక్ ఫుడ్స్ పెడుతున్నారు తల్లి దండ్రులు. ఇంకొందరు చాకోలెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటివి అలవాటు చేస్తుంటారు. అయితే పిల్లలు వీటిని తరచుగా తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.
అందుకే పిల్లలకు కొన్ని రకాల ఫుడ్స్ అని అస్సలు పెట్టకూడదు అంటున్నారు వైద్యులు. ఇంతకీ అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పిల్లల ఎక్కువగా తినే జంక్ ఫుడ్స్ లో చిప్స్ కూడా ఒకటీ. ఈ చిప్స్ తినడం వల్ల పిల్లల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో కొవ్వులు, ఉప్పు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లలు నూడుల్స్, మ్యాగీ వంటివి కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. వీటిని చాలా త్వరగా వండవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువగా పిల్లలకు నూడుల్స్ పెడుతుంటారు. కానీ ఈ నూడుల్స్‌లో ఉప్పు క్కువగా, పోషకాలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరగడంతో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అలాగే ప్రస్తుత రోజుల్లో పిల్లలు ఎక్కువగా ఇష్టపడే బయట ఫుడ్స్ లో పిజ్జా కూడా ఒకటి. ఇందులో ఎన్నో రకాల పిజ్జాలు ఉన్నాయి. ఈ కాలంలో పిల్లలు నుండి పెద్దవారి వరకు పిజ్జాలు తినటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పిజ్జా లలో చీజ్, సాస్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే చాలా ఎక్కువ కేలరీలు శరీరంలో పేరుకుపోతాయి. దాంతో జీర్ణ సమస్యలు కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. బర్గర్ వంటివి కూడా ఎక్కువగా తిన కూడదు. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో చాలా తక్కువ పోషకాలు కలిగి ఉంటాయి. వీటిని పిల్లలు తినడం ద్వారా ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముందుగా ప్యాక్డ్ స్నాక్స్‌లో సాధారణంగా ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, రక్తపోటు, షుగర్ వ్యాధి వంటి వ్యాధులకు దారితీస్తాయి.