Health Tips: సాధారణం మహిళలు కొంత వయసు వచ్చిన తర్వాత ఎదుర్కొనే సమస్య మెనోపాజ్. మహిళల్లో కొంత వయసు వచ్చిన తర్వాత పీరియడ్స్ ఆగిపోవడం జరుగుతుంది. ఇవే కాకుండా వారి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనివల్ల శరీరంలోని ఈస్ట్రోజన్ స్థాయి పూర్తిగా పడిపోతుంది. ఫలితంగా అండాశయ విడుదల జరగదు. పీరియడ్స్ సమయంలో పూర్తిస్థాయిలో పిరియడ్స్ రాకపోయినా, రుతు క్రమంలో మార్పులు వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ పరీక్షించుకోవడం మంచిది. ఈస్ట్రోజన్ స్థాయి తగ్గిపోతే శరీరం వేడిగా మారుతుంది. శరీరంలో ఈ హార్మోన్ హెచ్చుతగ్గులకు లోనైతే భావోద్వేగాల మీద కూడా నియంత్రణ కోల్పోతారు. అంతేకాకుండా మరెన్నో లక్షణాలు మిమ్మల్ని వేధిస్తాయి. అవేంటో ఒకసారి చదవండి.
మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ల తక్కువ స్థాయిలో ఉండటం వల్ల వారిలో నెలసరి రాకపోవడం లేదా నెలసరి సమయంలో తక్కువ స్రావం జరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం శ్రేయస్కరం. అంతే కాకుండా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గటం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడమే కాకుండా శరీర బరువు అధికం అవుతుంది.
ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి తగ్గిపోతే రాత్రి వేళల్లో పడుకున్న సమయంలో విపరీతమైన చెమటలు, శరీరం నుండి వేడి ఆవిర్లు బయటకు వస్తాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మెదడులోని హైపోథాలమస్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఆధారంగానే పని చేస్తుంది. ఈ హార్మోన్ స్థాయి తగ్గితే హైపోథలామస్ పనితీరు మందగిస్తుంది.
ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గటం వల్ల ఒత్తిడి, తెలియని ఆందోళన పెరుగుతాయి. దీనివలన మూడ్ తరచూ మారుతుంది. ఈ హ్యాపీనెస్ హార్మోన్ తగ్గటం వల్ల ఎటువంటి కారణం లేకుండా ఏడుపు రావడం, తరచూ బాధ పడటం వంటివి జరుగుతాయి. ఈ హార్మోన్ తగ్గడం వల్ల కారణం లేక పోయా ఆందోళన చెంది నిద్ర సరిగ్గా పట్టదు.
చర్మంలోని తేమను నిలిపి ఉంచే ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇది తగ్గడం వల్ల శరీరంలోని సహజ సిద్ధంగా తయారీ తగ్గి చర్మం నిర్జీవంగా తయారవుతుంది.ఈస్ట్రోజెన్ హార్మోను తగ్గిపోవడం వల్ల శరీరములో కన్నీళ్లు ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా కళ్ళు తరచూ పొడిబారతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల తరచూ తలనొప్పి రావడం జరుగుతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే మైగ్రేన్ కి దారితీసే అవకాశం ఉంది.