Health Tips: ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు లో మార్పులు రావడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరగటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే నెయ్యి తినటం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామంది అపోహపడుతున్నరు. కానీ ఏ మాత్రం నిజం లేదు. ప్రతి రోజూ తగిన మోతాదులో స్వచ్ఛమైన నెయ్యి తినటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం నెయ్యి కి దూరంగా ఉండాలి.
ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు నెయ్యి ఎక్కువగా తింటే హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ వల్ల అధిక బరువు సమస్యతో బాధపడే వారు కూడా నెయ్యి తక్కువగా తినాలి . లేదంటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి రక్త ప్రసరణ వ్యవస్థలో ఆటంకాలు ఏర్పడ్డాయి. తద్వారా కొన్ని సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
అలాగే లివర్ సమస్యతో బాధపడే వారు కూడా నెయ్యి, నూనె తో తయారు చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫ్యాటి లివర్ సమస్యతో బాధపడేవారు తీసుకోవటంవల్ల వారి సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడేవారు నూనె పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి.
దగ్గు ఈ సమస్యతో బాధపడే వారు ఆ సమయంలో నెయ్యి తినడం వల్ల వారి సమస్య పెరుగుతుంది. దగ్గు పూర్తిగా తగ్గేవరకు నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలు తినక పోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.