Guava Side Effects: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు జామ పండ్లను తినకూడదని తెలుసా?

Guava Side Effects: ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పండ్లను చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని రకాల పండ్లలో ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అనారోగ్యంగా ఉన్నప్పుడు పండ్లు తినమని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే ఇండియన్ యాపిల్ గా పిలవబడే జామ పండు తక్కువ ధరతో సామాన్యుడికి కూడా నిత్యం అందుబాటులో ఉంటుంది. జామ పండు తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ జామ పండు తినడం వల్ల ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎవరెవరు ఈ జామ పండ్లు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా జామ పండు ఆరోగ్యానికి మంచిదని మనం వింటుంటాం. జామ పండు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండి,జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జామ పండు తినడం వల్ల శరీరంలో ఇమ్మునిటి పవర్ ఆర్ పెరుగుతుంది. కానీ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ జామ పండు తినటం వల్ల ప్రమాదం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు జామ పండ్లు ఎక్కువగా తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా జామపండులో చక్కెర ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు జామపండ్లను కాకుండా పచ్చగా ఉన్న జామకాయలను తినటం శ్రేయస్కరం.

పేగు వ్యాధి ఉన్నవారు జామపండును తినకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. జామపండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకాన్ని తగ్గింది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగు వ్యాధి ఉన్నవారు జామ పండ్లు అధికంగా తినటం వల్ల దాని ప్రభావం జీర్ణ వ్యవస్థ మీద పడి విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది.

జామకాయలో విటమిన్ సి, ఫ్రక్టోజ్ లు అత్యధికంగా ఉంటాయి. మన శరీరంలో ఈ రెండింటి శాతం ఎక్కువ అయితే శరీరం వాపు వస్తుంది. జామపండ్లను సమయం సందర్భం లేకుండ ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన తర్వాత జామపండ్లు తిని నిద్రించడం వల్ల కడుపులో మంట ఏర్పడే ప్రమాదం ఉంది.